విద్యాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎన లేని కృషి చేస్తున్నదని, ‘మన ఊరు-మన బడి’ పథకం ఏర్పాటు చేసి పాఠశాలలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
- విద్యా దినోత్సవంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నెన్నెల, జూన్ 20: బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎన లేని కృషి చేస్తున్నదని, ‘మన ఊరు-మన బడి’ పథకం ఏర్పాటు చేసి పాఠశాలలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. మంళవారం మండలంలోని కుష్నపల్లి గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయాలని అందరికీ ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం ద్వారా సంకల్పంతో అదనపు గదులు, మరమ్మతులు, టాయిలెట్లు, భోజన శాల, తాగునీటి పంపులు చేపడుతున్నట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం, వారంలో మూడు సార్లు కోడిగుడ్డు, కిచిడీ , పౌష్టికాహరం అందిస్తున్నదన్నారు. ప్రతి ఏడాదీ ఉచితంగా యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నదని చెప్పారు. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో ఐఐటీ, జేఈఈ లాంటి సీట్లు సాధిస్తున్నారని తెలిపారు.
ఉన్నత చదువులు విద్యార్థులకు స్కాలర్షిప్లు, విదేశాలకు చదువుకునే వారికి దాదాపు రూ.20 లక్షల వరకు సాయం అందిస్తున్నదన్నారు. ఎన్నికల వేళ సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా వచ్చే డబ్బు సంచుల ముఠా నాయకుల మోస పూరిత మాటలు ప్రజలు నమ్మవద్దన్నారు. డబ్బులతో కొనాలని చూస్తారని అలాంటి వారి చేతుల్లో ప్రజలు మోసపోవద్దన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనితీరును, ప్రజల్లో నిత్యం ఉండే నాయకులను గుర్తించుకోవాలని కోరారు. అనంతరం రూ. 14 లక్షలతో చేపట్టిన పాఠశాలలో మౌలిక వసతులను ఆయన ప్రారంభించారు. డబుల్ డెస్క్ బెంచీలను విద్యార్థులకు అందజేశారు. ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ నిరంజన్, జడ్పీటీసీ సింగతి శ్యామల, కో ఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, సర్పంచ్ సంధ్య, ఎంఈవో మహేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో నవీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాగర్‌గౌడ్, భీమాగౌడ్, నాయకులు రాంచందర్, సుగుణయ్య, మహేశ్వర్‌రెడ్డి, రమేశ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కన్నెపల్లిలో..
కన్నెపల్లి, జూన్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. విద్యా దినోత్సవంలో ఆయన పాల్గొని కన్నెపల్లిలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. గురుకుల పాఠశాలలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు మెరుగైన విద్య, వసతి, భోజనం, పుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి ఏఎంసీ చైర్మన్ నిరంజన్ గుప్తా, జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, సర్పంచ్ పుల్లూరి సురేఖ, ఎంపీటీసీ నెండుగూరి భారతి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజన్న, జడ్పీ సీఈవో నరేందర్, డీఎల్పీవో ఫణిందర్‌రావు, ఎంపీడీవో రాధాకిషన్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
కన్నెపల్లి, భీమిని మండలాల్లో..
కన్నెపల్లి, భీమిని మండలాల్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గ్రామాల్లో ర్యాలీ తీశారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కన్నెపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కన్నెపల్లి జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ యూనిఫాంలు, పుస్తకాలు అందజేశారు. సర్పంచులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాలల్లో…
బెల్లంపల్లి/బెల్లంపల్లిరూరల్, జూన్ 20: విద్యా దినోత్సవ వేడుకలు ప్రభుత్వ బాలుర జూనియర్, బాలికల జూనియర్ కళాశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఇటీవల రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ లెక్చర్లను ప్రిన్సిపాల్ శాలువాతో సత్కరించారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆవుల అంజయ్య, పీడీ బాబురావు, కృష్ణవేణి, విద్యార్థులు పాల్గొన్నారు.
తాండూర్ మండలంలో..
తాండూర్, జూన్ 20 : మంగళవారం మండల కేంద్రంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు. అనంతరం డిజిటల్ క్లాస్ రూంలను ప్రారంభించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్‌లు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ర్యాలీలు తీశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, బోయపల్లి ఎంపీటీసీ, బుగ్గ దేవస్థానం చైర్పర్సన్ మాసాడి శ్రీదేవి, కో ఆప్షన్ సభ్యుడు రహ్మత్‌ఖాన్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో సత్యనారాయణ, ఎంఈవో వాసాల ప్రభాకర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ఐఐటీ ర్యాంకర్‌కు సన్మానం
బెల్లంపల్లిరూరల్, జూన్ 20: బెల్లంపల్లి మండలంలోని గురిజాల ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇటీవల ఐఐటీ ఫలితాల్లో 182 వ ర్యాంకు సాధించిన గోగుల నిత్యశ్రీని పాఠశాలలో సర్పంచ్ గాజుల రంజిత ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. నిత్యశ్రీని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం నిత్యశ్రీ తల్లిదండ్రులు గోగుల తార, రాజన్నను గ్రామస్తులు అభినందించారు. ఈ విద్యాదినోత్సవంలో ప్రధానోపాధ్యాయుడు మహేశ్వర్‌రావు, ఎంపీటీసీ శకుంతల, విద్యాకమిటీ చైర్మన్ డీ పద్మ, వైస్ చైర్మన్
మారయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకెనపల్లిలో..బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లిలో జిల్లా పరిషత్ పాఠశాలలో సర్పంచ్ పొట్లపల్లి ఉమాదేవి, ఎంపీటీసీ పొట్లపల్లి సుభాష్రావ్ ఆధ్వర్యంలో విద్యా దినోత్సవం సందర్భంగా ర్యాలీ తీశారు. పాఠశాలలో డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శైలజ, ఎస్ఎంసీ చైర్మన్ బచ్చలి శంకర్, యాదనవేణి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వేమనపల్లిలో..
వేమనపల్లి, జూన్ 20 : మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీలు తీశారు. వేమనపల్లిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్ కుబిడె మధుకర్, ఎంఈవో తిరుపతిరెడ్డి పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ రాజన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..
బెల్లంపల్లి, జూన్ 20: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యాదినోత్సవంలో భాగంగా ప్రిన్సిపాల్ మేకల గోపాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆటల పోటీలు, రంగోలి, పోస్టర్ ప్రజెంటేషన్, వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్, అకాడమిక్ కో ఆర్డినేటర్ శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల్లో మెరుగైన ఫలితాలు
బెల్లంపల్లిరూరల్, జూన్ 20: గురుకులాలకు ఎనలేని ప్రాధాన్యత దక్కిందని సంక్షేమ గురుకులాల ఆదిలాబాద్ రీజియన్ ఆర్పీవో కొప్పుల స్వరూపారాణి అన్నారు. మంగళవారం బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో నిర్వహించిన విద్యా దినోత్సవ సంబురాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల నుంచి జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో క్వాలిఫై అయిన వారితో పాటు అజీం ప్రేమ్‌జీ వంటి యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులను సన్మానించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, వైస్ ప్రిన్సిపాల్ కే రాజ్‌కుమార్, స్టాఫ్ సెక్రటరీ శ్యామ్‌సుందర్‌రాజు, అకాడమిక్ ఇన్చార్జి శ్రీరామవర్మ, సీనియర్ ఉపాధ్యాయులు వరమని ప్రమోద్‌కుమార్ అధ్యాపకులు చందా లక్ష్మీనారాయణ, మిట్ట రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాసిపేటలో..
కాసిపేట, జూన్ 20 : కాసిపేట మండలంలో విద్యా దినోత్సవాన్ని నిర్వహించి ర్యాలీలు తీశారు. విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలను అందించారు. ముత్యంపల్లిలో సర్పంచ్ ఆడె బాదు, ఉప సర్పంచ్ తిరుపతి, ఉపాధ్యాయులు పుష్పలత, బండ శాంకరి, కృష్ణ గోపాల్‌రావు, మాధవి లత, అనసూయ, అర్చన, కాసిపేటలో ఎంపీడీవో ఎంఏ అలీం, హెచ్ఎం అబ్దుల్ లతీఫ్, దేవాపూర్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, ఓసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతిరెడ్డి, హెచ్ఎం దామోదర్‌రెడ్డి, ఆయా గ్రామాల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
కాసిపేట, జూన్ 20 : కాసిపేట మండలంలోని లంబాడీతండా(ఎస్) ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయుడు జే సురేశ్ ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ సేవలను గుర్తించి మంచిర్యాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విద్యాదినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే దివాకర్‌రావు, అడిషనల్ కలెక్టర్లు, విద్యా శాఖ అధికారుల చేతుల మీదుగా సన్మానం పొంది ప్రశంసా పత్రాన్ని అందించారు. దీంతో పాటు సోనాపూర్ ఉపాధ్యాయురాలు బీ రాధిక తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళాలో గణితంలో ఉత్తమ ప్రదర్శనతో ద్వితీయ స్థానంలో పొందినందుకు ఎమ్మెల్యే, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు చేతుల మీదుగా సన్మానించి, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

