నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో గల జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. అకాల వర్షంతో పంటలు కోల్పోయిన రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుసుకున్నారు. మ్మెల్యే వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లారీలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు తక్షణమే లారీలు కేటాయించాలన్నారు.
ఈ మేరకు లారీలు వచ్చేలా ఓనర్లతో ఎమ్మెల్యే మాట్లాడి లారీలు వచ్చేలా కృషి చేశారు. రైతులు అధ్యర్యపడొద్దని కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రతి రైతుకు అండగా ఉంటారన్నారు. రైతుల కోసం మేము కొట్లాడుతామని భరోసా కల్పించారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనే పరిస్థితిలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రు,సర్పంచ్ నీలిమ రవీందర్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, శివారెడ్డి, ప్రతాప్, సుజీల్, స్వామి, శ్రీధర్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.