Budjet 2024 to 25 బడ్జెట్‌పై ఆశలు
రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ర్టానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఒక్కపైసా కూడా విదిల్చలేదు.
- నేడు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి విక్రమార్క
- జిల్లాలో వరద విపత్తు నిర్వహణకు ప్రత్యేక కేటాయింపులు
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్, రెవెన్యూ డివిజన్‌పై ఆశలు
- పడ్తనపల్లి ఎత్తిపోతల పథకంపై ముందుకు కదిలేనా..
- ఆయిల్ పాం ఫ్యాక్టరీ ఏర్పాటుపై చొరవ చూపేనా..
- ఆగిన పలు అభివద్ధి పనులకు నిధులపై జిల్లావాసుల ఆశలు
మంచిర్యాల, జూలై 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ర్టానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఒక్కపైసా కూడా విదిల్చలేదు. కాగా.. నేడు(గురువారం) రేవంత్‌రెడ్డి సర్కారు ప్రకటించే రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తూ నిధులు ఉండాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు.
- గోదావరి వరదతో ముంపునకు గురయ్యే కోటపల్లి మండలంలోని గ్రామాలుసహా మంచిర్యాల జిల్లా కేంద్రానికి వరద ముంపు నివారణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారనే చర్చ నడుస్తున్నది.
- గోదావరి కరకట్ట నిర్మాణంపై ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు. గోదావరి మీదుగా మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి పనులను అర్ధాంతరంగా ఆపేసి, ముల్కల్ల నుంచి ముర్మూర్‌కు బ్రిడ్జి వేస్తామని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రకటించారు. ఈ బడ్జెట్లో నిధులు సాధించుకొస్తారని అంతా భావిస్తున్నారు.
- అన్ని మండల కేంద్రాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు.బీఆర్ఎస్ సర్కారు హయాంలో శంకుస్థాపన చేసుకున్న చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్, పడ్తనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, గూడెం లిఫ్ట్ పనులకు నిధులు కేటాయిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
- బీఆర్ఎస్ సర్కారు చెన్నూర్ రెవెన్యూ డివిజన్‌సహా పారుపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అది మరుగున పడింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.
- మందమర్రిలో ఆయిల్ పాం ఫ్యాక్టరీకి గత ప్రభుత్వం భూమి పూజ చేసింది. కొన్ని కారణాలతో ఫ్యాక్టరీ ఉంటుందా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. దీంతో వేల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేసిన రైతులు ఫ్యాక్టరీపై ఈ బడ్జెట్లో స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు.
- బెల్లంపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, ఐటీ హాబ్ వంటి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. నిధులు కేటాయిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నారు.
- అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేడెట్ మార్కెట్లు పనులు సగంలోనే ఆగిపోయయాయి. మారుమూల గ్రామాలకు వెళ్లే రహదారుల్లో బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కార్ పెద్దపీట వేసింది. జిల్లాలో 30 నుంచి 40 బిడ్జిలు నిర్మించి అనేక గ్రామాలకు రాకపోకలను మెరుగుపరిచింది. ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. నిధుల కేటాయింపులు చేస్తే బాగుంటుందని జనం భావిస్తున్నారు.
నాయకులపై గంపెడాశలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇందులో నాలుగింటిని కాంగ్రెస్ గెలిస్తే.. ఇందులో మూడు స్థానాలు మంచిర్యాల జిల్లాలోనే ఉన్నాయి. పైగా ప్రేమ్‌సాగర్‌రావు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు అత్యంత ఆప్తుడని అందరికీ తెలిసిందే. మరోవైపు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మె ల్యే వినోద్‌లు తమ సీనియార్టీ, సీఎం రేవంత్‌రెడ్డితో ఉన్న పరిచయాలతో పెద్ద ఎత్తున నిధులు తెస్తారని జనం గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోపరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ మంచిర్యాల జిల్లావాసులకు కీలకంగా మారింది. మరి జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు నిధులు కేటాయింపులు ఉంటా యా? లేదా? అన్నది గురువారం తేలిపోతుంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై జిల్లా ప్రజానీకం ఆశగా ఎదరుచూస్తున్నది. అనేక సమస్యలు పట్టిపీడిస్తుండగా, సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకుంటుందేమోనన్న ఆతృతలో ఉన్నారు. జిల్లా మొత్తంగా 40కి పైగా వాగులపై వంతెనలు నిర్మించాల్సి ఉంది. అర్ధాంతరంగా నిలిచిపోయిన గుండి వంతెనను నిర్మించేందుకు రీఎస్టిమేట్ చేసినప్పటికీ నిధులు లేక పనులు ప్రారంభం కాలేదు. లక్ష్మీపూర్, తుంపెల్లి, అనార్పల్లి వంతెనల ప్రతిపాదనలు చాలా కాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి.
బ్రిడ్జిలు లేకపోవడంతో వానకాలంలో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలు పడ్డప్పుడల్లా బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి అష్టకష్టాలు పడుతున్నారు. అలాగే రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణం నరకప్రాయంగా మారింది. దాదాపు 140కి పైగా గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన కుమ్రం భీం ప్రాజెక్టు కట్టకు బీటలు వారుతున్నాయి.
10 టీఎంసీల సామర్థ్యంతో దాదాపు రూ. 800 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 45 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, కట్టకు బీటలు వస్తుండడంతో 5 టీఎంసీలకు నీటి సామర్థ్యానికే పరిమితం చేశారు. పగుళ్లు తేలుతున్న కట్టపై కవర్లు కప్పి అధికారులు కవర్చేస్తున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలతో పాటు మానవ సంబంధాలను మెరుగుపరిచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా వార్ధా వంతెన నిర్మాణం కోసం రూ. 75 కోటుల మంజూరు చేసింది.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వంతెన నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు. ప్రాణహితపై బారాజ్ నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపగా, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమైనా బడ్జెట్లో జిల్లాకు నిధులు కేటాయిస్తుందో లేదోనని ప్రజల సందేహిస్తున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

