మంచిర్యాల ఏసీసీ, మే 18 : అర్హతకు మించి వైద్యమందిస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా ఇన్చార్జి వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత అన్నారు. శనివారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రైవేట్ ఆర్ఎంపీ, పీఎంపీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
ఆర్ఎంపీ, పీఎంపీలందరూ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, పేరు పకన డాక్టర్ అని రాసుకోరాదని, క్లినిక్‌లో ఎలాంటి మందులు ఉండరాదని, ప్రిస్రిప్షన్ రాయరాదని సూచించారు. జిల్లాలో జాతీయ కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ ద్వారా ఆర్ఎంపీలు, పీఎంపీ క్లినిక్‌లలో తనిఖీలు కొనసాగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా వైద్యమందిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డెమోబుక వెంకటేశ్వర్ పాల్గొన్నారు.