గొర్రెల పెంపకంలో పునరుత్పత్తే కీలకం
గొర్రెల పెంపకంలో లాభనష్టాలు ప్రధానంగా వాటి పునరుత్పత్తిపై ఆధారపడి ఉంటామని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు.
- జాగ్రత్తలు పాటిస్తే మేలు
- పశు సంవర్ధక జేడీ డాక్టర్ రమేశ్ కుమార్
మంచిర్యాల అర్బన్, జనవరి 31: గొర్రెల పెంపకంలో లాభనష్టాలు ప్రధానంగా వాటి పునరుత్పత్తిపై ఆధారపడి ఉంటామని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు. మరోవైపు సీజనల్ వ్యాధులైన గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటే నష్టాలు దరిచేరవని గొర్రెల యజమానులకు సూచించారు. గొర్రెల్లో పునరుత్పత్తిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితరాలపై ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
పునరుత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
90 శాతం గొర్రెలు జనవరి నుంచి మార్చి వరకు ఎదకొస్తాయి. రెండో సీజన్ జూన్ నుంచి ఆగస్టు వరకు ఎదకు వస్తాయి.
మంచి జాతి పొట్టేళ్లను ఎంపిక చేసుకొని మందలో వదలాలి.
మందలో పునరుత్పత్తి శక్తి తగ్గిన, పళ్లు లేని ముసలి గొర్రెలను ఏరివేయాలి.
ఏడాది కన్నా ఎక్కువ కాలం కట్టుకు రాని, గొడ్డుమోతు జీవాలను మందలో నుంచి ఏరి వేయాలి.
గొర్రెలను సంతలో కొనరాదు. మంచి మందులను పరిశీలించి అందులో నుంచి ఎంపిక చేసుకోవాలి.
పిల్లలు పుట్టిన వెంటనే ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలి. ముక్కు, నోరు మీద పొర తొలగించాలి.
గంటలోపు ముర్రుపాలు తాగించాలి.
పిల్లల్లో మొదటి మూడు నెలల్లో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.
మూడు నెలల వయస్సు దాటిన తరువాత నట్టల నివారణ మందు తాగిపించాలి.
తరువాత 15 రోజుల్లోపు చిటుకు వ్యాధి టీకాలు వేయించాలి.
ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన మూడు నెలలకే గొర్రెపిల్ల 12 నుంచి 14 కిలోల బరువుకు చేరుకుంటుంది.
గొర్రెల్లో వచ్చే వ్యాధులు, నివారణ
గొర్రెలకు ముఖ్యంగా నిమోనియా, చిటుకు, వైరస్, గాలికుంటు, నీలి నాలుక వ్యాధులు వస్తాయి.
తొలకరి వర్షాలు మొదలైన తరువాత వచ్చే వ్యాధుల్లో గాలికుంటు, నీలి నాలుక ముఖ్యమైనవి. వీటి నివారణకు ఆక్సిటెట్రాసైక్లిన్ 10 మిల్లీ గ్రాములు, పొటాషియం పర్మాంగనేట్ 50 మి. గ్రాములు 100 మిల్లీ లీటర్ల నీటిలో కలిపి తాగించాలి. వీబీఆర్ఐ సంస్థ తయారు చేసిన టీకా మందు ప్రభుత్వ దవాఖానల్లో ఇస్తారు.
ఊపిరితిత్తుల్లో నెమ్ము ఉన్న గొర్రెలకు జ్వరం, దగ్గు, ముక్కు నుంచి చీమిడి, నీరు కారడం, ఎగశ్వాస అధికంగా ఉంటుంది. నివారణకు స్ట్రెఫ్టోపెన్సిలిన్ 5 మిల్లీ గ్రాములు లేదా జెంటామైసిన్ 4 మిల్లీ గ్రాములు లేదా సిప్రాప్లాక్సిన్ 5 మిల్లీ గ్రాములు ఇవ్వాలి.
గాలికుంటు వ్యాధి సోకిన గొర్రెల్లో నాలుక, ముక్కుపై, కాలిగిట్టల మధ్య, పొదుగు మీద బొబ్బలు ఏర్పడతాయి. తద్వారా గొర్రెమేత తీసుకోలేక నీరసించిపోతుంది. నివారణకు ప్రభుత్వం సరఫరా చేసే గాలికుంటు వ్యాధి టీకా ఐదు మిల్లీ మీటర్లు లేదా రక్ష ఎఫ్ఎండీ టీకా ఒక మిల్లీ లీటర్ ప్రతి ఆరు నెలలకోసారి చర్మం కింద ఇవ్వాలి.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

