గిరిజనులకు మంచిర్యాల పోలీసుల నిత్యావసరాల పంపిణీ

మంచిర్యాల : కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీసులు ఆదివారం తాండూర్ మండలంలోని మారుమూల నర్సాపూర్ గ్రామంలో గిరిజన ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలను పాటించాలని గిరిజనులను కోరారు. ప్రజలకు పోలీసులు తమ సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తారన్నారు. సమస్యలేవైనా ఉంటే పోలీసులతో పంచుకోవాలని తెలిపారు. నిత్యావసరాలు అందించిన స్థానిక పోలీసులను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్, తాండూర్ ఇన్స్పెక్టర్ కె.బాబు రావు, మాదారం సబ్ఇన్స్పెక్టర్ మానస పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

