కాసిపేటలో గుట్టలు మాయం.. పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ అధికారులు
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామ పంచాయతీ శివారు గుట్టలను అక్రమార్కులు మాయం చేస్తున్నారు. కాసుల కక్కుర్తి కోసం ప్రకృతి అందాలతో ఉన్న సంపదను కొల్లగొడుతున్నారు.
కాసిపేట, నవంబర్ 14 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామ పంచాయతీ శివారు గుట్టలను అక్రమార్కులు మాయం చేస్తున్నారు. కాసుల కక్కుర్తి కోసం ప్రకృతి అందాలతో ఉన్న సంపదను కొల్లగొడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్థానికులు సమాచారం ఇచ్చినా ‘మాములు’గా తీసుకొని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
కొద్దిరోజులుగా కాసిపేట మండలంలోని గుట్టలను తవ్వి బండను అక్రమంగా తరలిస్తున్నారు. రోజువారీ తంతుగా ఈ అక్రమ తరలింపు జరుగుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై స్థానిక ఆదివాసీ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బండ తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానిక ఆదివాసీ గిరిజనులు అడ్డుకున్నారు. గుట్టలను తవ్వి బండను తీసి అక్రమంగా తరలించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు వారీగా ఈ తంతు సాగుతున్నా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. చాలా సార్లు ట్రాక్టర్లలో అక్రమంగా బండ తరలిస్తున్న వారికి తీయద్దు అని చెప్పినా కొన్ని రోజులు ఆపడం.. మళ్లీ తీయడం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. అధికారులకు తెలిపితే అసలు పట్టించుకోవడం లేదని, ఇంత ఘోరంగా ఉండటమేంటని అధికారుల తీరుపై మండి పడుతున్నారు. బండ కోసం మొత్తం గుట్టలను ఎక్కడికక్కడ తవ్వకాలు చేసి గుట్టలను మాయం చేస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

