మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్‌రెడ్డి ఔదార్యం

మంచిర్యాల : మంచిర్యాల డిప్యూటీ పోలీస్ కమిషనర్ డి.ఉదయ్ కుమార్‌రెడ్డి తన చర్య ద్వారా మానవత్వాన్ని చాటారు. దండేపల్లికి చెందిన బాలింత గుడికందుల భాగ్యలక్ష్మి, ఆమె భర్త సతీశ్ ఆస్పత్రిలో చూపించుకునేందుకు మంగళవారం మంచిర్యాల పట్టణానికి వచ్చారు. అయితే లాక్డౌన్ సడలింపు వేళలు ముగియడంతో పట్టణంలోనే చిక్కుకుపోయారు. గ్రామానికి వెళ్లేందుకు ఎటువంటి రవాణా సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. విధుల్లో ఉన్న డీసీపీ ఉదయ్ కుమార్‌రెడ్డి ఇది గమనించి ఔదర్యం ప్రదర్శించారు. పోలీసు వాహనాన్ని ఏర్పాటు చేసి వారిని ఇంటికి సురక్షితంగా సాగనంపారు. ఈ సందర్భంగా దంపతులు డీసీపీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఉదయం 10 గంటల లోపే పనులు ముగించుకోవాలని పోలీసులు సూచించారు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే పోలీసులను సంప్రదించాల్సిందిగా సూచించారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

