‘కార్మిక గర్జన’ను విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు.
తాండూర్, అక్టోబర్ 13 : సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 14న గోదావరిఖనిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సింగరేణి కార్మిక గర్జన’ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా తాండూర్ లో మంగళవారం సింగరేణి కార్మిక గర్జన సన్నాహక సమావేశం నిర్వహించారు. సభను విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
బీఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు.
తాండూర్ మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, మాజీ ఎంపీపీ పూసాల ప్రణయ్ కుమార్, మాజీ జెడ్పిటిసి మంగపతి సురేష్ బాబు, సీనియర్ నాయకులు మహోర్కర్ దత్తాత్రేయరావు, బోనగిరి చంద్రశేఖర్, మాసాడి శ్రీరాములు, ఎలుక రామచందర్, గట్టు సంతోష్ కుమార్, మొగిలి శంకర్, గడ్డం మణి కుమార్, కిష్టఫర్, దుర్గం శ్రీనివాస్, బోడ సతీష్, జాడి పోషం, గొమాస తిరుపతి, చింటూ, బాబుఖాన్, ప్రదీప్ రావు, ఉప్పుట్ల సంతోష్, ఇక్బాల్, రాకేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీబీజీకేఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

