బెల్లంపల్లి, డిసెంబర్ 25 : ప్రపంచ శాంతికి చిహ్నం క్రిస్మస్ పండుగ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీ పెంతె కోస్తు చర్చి, సీఎస్ఐ చర్చిల్లో ఆదివారం ఉదయం ఆయన మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 24వ వార్డులో వేడుకల్లో కౌన్సిలర్ దామెర శ్రీనివాస్ పాల్గొన్నారు. పట్టణంలోని పలు చర్చిల్లో క్రైస్తవులు శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు మాథ్యూ, జాన్ పీటర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కల్వరీ చర్చిలో..
కాసిపేట, డిసెంబర్ 25 : సోమగూడెం, బెల్లంపల్లి రహదారి మధ్యలోని కల్వరీ చర్చిలో ఆదివారం ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వారి కుటుంబ సమేతంగా ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కల్వరీ పాస్టర్ ప్రవీణ్ ప్రత్యేక ప్రార్థనలు చేయగా భారీగా క్రైస్తవులు హాజరై క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్ని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం కార్యక్రమానికి హాజరైన క్రైస్తవులను పాస్టర్ ప్రవీణ్ దీవించారు. దీంతో పాటు సోమగూడెం, కాసిపేట, దేవాపూర్ తదితర గ్రామాల్లో చర్చిల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు.
లక్షెట్టిపేటలో..
లక్షెట్టిపేట, డిసెంబర్ 25: పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు తనయుడు నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి పాస్టర్ రెవరెండ్ కరుణాకర్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, మాజీ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు షాహెద్ అలీ, నూనె ప్రవీణ్, కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తాండూర్‌లో..
తాండూర్, డిసెంబర్ 25 : మండలంలోని రేపల్లెవాడ, రాజీవ్‌నగర్, కిష్టంపేట, గంపలపల్లి, కొత్తపల్లి, తాండూర్, ఐబీ, మాదారం తదితర గ్రామాల్లోని చర్చిల వద్ద ఆదివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం సామూహిక భోజనాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
జన్నారం మండలంలో..
జన్నారం, డిసెంబర్ 25 : మండలంలోని కిష్టాపూర్, జన్నారం, రేండ్లగూడ, చింతగూడ, పొనకల్ గ్రామాల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్యాబ్రేల్, రాజు, సిటిమల భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలో..
మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 25 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడ సీఎస్ఐ చర్చి, బెల్లంపల్లి చౌరస్తాలో గల క్యాథలిక్ చర్చి, తదితర చర్చిల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ యువ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, క్రైస్తవులు పాల్గొన్నారు.
హాజీపూర్ మండలంలో
హాజీపూర్, డిసెంబర్ 25: మండలంలోని ముల్కల్ల, గుడిపేట, రాపల్లి గ్రామాల్లోని చర్చిల్లో భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని బీఆర్ఎస్ నాయకుడు నడిపెల్లి విజిత్ రావు, ఎంపీపీ మందపల్లి స్వర్ణలత – శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు.
రామకృష్ణాపూర్ పట్టణంలో..
రామకృష్ణాపూర్, డిసెంబర్ 25: పట్టణంలోని సెయింట్ పీటర్స్ చర్చితో పాటు పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రచార ఇన్చార్జి ఏం జాషువా, చర్చి ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్ సెక్రటరీ డొలకల డేవిడ్ క్రీస్తు సందేశాన్ని వినిపించారు. జీఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, రామకృష్ణాపూర్ ఏరియా దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డా. రాజారమేశ్ మిత్రబృందం క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి, అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టువర్ట్ కే. దేవానందం, చర్చి కమిటీ సభ్యులు బీ ప్రభు దయాల్, ఉమెన్స్ ప్రెసిడెంట్ ఎం. కళావతి జాషువా, ఎస్తెర్ డేవిడ్, ఉమెన్స్ సెక్రటరీ సీహెచ్ ప్రేమలత రవి, సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వేమనపల్లి మండలంలో..
వేమనపల్లి, డిసెంబర్ 25 : మండలంలో నీల్వాయిలోని యేరూషలేము చర్చిలో పాస్టర్ పుల్లయ్య ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీటీసీ సంతోష్‌కుమార్ , సర్పంచ్ గాలి మధు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి, నాయకులు పూర్ణచందర్‌రెడ్డి, మధుసూదన్, అబీద్‌ఖాన్, అబ్దుల్‌ఖాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కన్నెపల్లి, భీమిని మండలాల్లో..
కన్నెపల్లి, డిసెంబర్ 25 : కన్నెపల్లి, భీమిని మండలాల్లో క్రైస్తవులు ఆదివారం క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు. కన్నెపల్లి మండలంలోని ఏసయ్యపల్లి, జన్కాపూర్ గ్రామాల్లోని చర్చిల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్‌లను కట్ చేశారు. క్రైస్తవులు ఇండ్ల ముందు క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసి సంతోషంగా వేడుకను నిర్వహించారు.
శ్రీరాంపూర్‌లో..
శ్రీరాంపూర్, డిసెంబర్ 25 : నస్పూర్ మున్సిపాలిటీలో శ్రీరాంపూర్ కాలనీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, నడిపెలి ్లచారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు పాల్గొని కేక్ కట్‌చేసి పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు. నస్పూర్ కాలనీ, సీసీసీ, నస్పూర్‌లో పలు చర్చిల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పంబాల గంగాఎర్రయ్య, బెడిక లక్షి, పూదరి కుమార్, బౌతు లక్షి, వంగ తిరుపతి, పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య పాల్గొన్నారు.
నస్పూర్ పట్ణణంలో..
సీసీసీ నస్పూర్, డిసెంబర్ 25: సీసీసీ, సంఘమల్లయ్యపల్లె, నస్పూర్, విలేజ్శ్రీరాంపూర్, తదితర ప్రాంతాల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. సీసీసీ సీఎస్ఐ చర్చిలో బీఆర్ఎస్ యువ నాయకుడు, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, సుధామల్ల హరికృష్ణ, నాయకులు గర్శె రామస్వామి, హైమద్, గర్శె భీమయ్య, కాటం రాజు, జాబ్రిగౌస్, తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి మండలంలో..
మందమర్రి డిసెంబర్ 25: మందమర్రి పట్టణంలో చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముద్దవం పద్మారావు, దేవి, నవీన్, బడికెల రవి, కొండ రాజరత్నం, కిశోర్, చరణ్, సంధ్య, రీటా, రాణి, కమల్ బాబు తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి మండలంలో..
దండేపల్లి, డిసెంబర్ 25: దండేపల్లి మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చితో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లోని చర్చిల్లో ప్రార్థనలు చేశారు. వారికి బీఆర్ఎస్ నాయకులు, వివిధ సంఘాల సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.