ఎదులాపురం, జూన్ 27 : ఆదిలాబాద్ జిల్లా పరిశ్రమల శాఖ నూతన జనరల్ మేనేజర్‌గా ఎం అశోక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొకను అందజేశారు. కలెక్టర్ రాజర్షి షా జనరల్ మేనేజర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, పరిశ్రమల శాఖ కార్యకలాపాలను పారదర్శకతతో, సమర్థవంతంగా నిర్వహించి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.