మంచిర్యాల ఏసీసీ, మార్చి 2 : మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన పలు విభాగాల్లోని 26 ఖాళీ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న అధికారులు ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు నాలుగు రోజులు అవకాశం ఇవ్వగా, శనివారం ఆఖరు తేదీ కావడంతో నిరుద్యోగ యువతీ, యువకులు పెద్ద ఎత్తున డీఎంహెచ్వో కార్యాలయానికి తరలివచ్చారు.
గంటల తరబడి క్యూలో వేచి ఉండి తమ దరఖాస్తులను సమర్పించారు. స్టాఫ్ నర్సు పోస్టులు 9 ఉండగా, 918 దరఖాస్తులు, ఫార్మాసిస్టు 5 పోస్టులకు 247.., రిఫ్రిజిరేటర్ మెకానిక్ 1 పోస్టుకు 14.., డిస్ట్రిక్ట్ అకౌంట్ ఆఫీసర్ 1 పోస్టుకు 54.., జిల్లా డాటా మేనేజర్ 1 పోస్టుకు 36.., ఎస్టీఎల్టీ 1 పోస్టుకు 48.., జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ 1 పోస్టుకు 29.., సీనియర్ డాట్స్ టీబీ హెచ్ఐవీ 1 పోస్టుకు 73.., మెడికల్ ఆఫీసర్ (ఎఫ్టీ) 2 పోస్టులకు 3.., డీఈవో కం అకౌంట్ 1 పోస్టుకు 153.., సపోర్ట్ స్టాఫ్ 2 పోస్టులకు 123.. మొత్తంగా 1747 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.