అక్కడ పస్తులు.. ఇక్కడ పనులు
ఇతర రాష్ర్టాల వారిని కూడా తెలంగాణ తల్లి అక్కున చేర్చుకుంటున్నది. మన రాష్ట్రంలో ఉన్న వారికే కాకుండా పొట్ట చేతబట్టుకొని వచ్చిన ఇతర రాష్ర్టాల కూలీలకూ పని కల్పిస్తున్నది.
- తెలంగాణలో ఉపాధి పొందుతున్న ఇతర రాష్ట్రాల కూలీలు
- కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులు, నాట్ల పనుల్లో బిహారీలు బిజీబిజీ
- సీజనల్ పనులు చేస్తూ ఉపాధి
చెన్నూర్ రూరల్, జనవరి 21 : ఇతర రాష్ర్టాల వారిని కూడా తెలంగాణ తల్లి అక్కున చేర్చుకుంటున్నది. మన రాష్ట్రంలో ఉన్న వారికే కాకుండా పొట్ట చేతబట్టుకొని వచ్చిన ఇతర రాష్ర్టాల కూలీలకూ పని కల్పిస్తున్నది. వారి సొంత గ్రామాల్లో పనులు దొరకక ఇక్కడి ఎందరో మంది వలస వస్తున్నారు. సీజన్‌ను బట్టి ఆయా పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తెలంగాణలో బిహారీ కూలీలకు చేతినిండా పని దొరుకుతున్నది. అక్కడ పనులు తక్కువగా ఉండడం, సక్రమంగా పనులు దొరకకపోవడం, మన దగ్గర కూలీలు సరిగా దొరకక పోవడంతో వ్యవసాయ పనులు కొన్ని చోట్ల ఆలస్యమవుతున్నాయి. కాగా, బిహార్ నుంచి పొట్ట చేతపట్టుకొని వచ్చిన పలువురు వరినాట్లు వేయడం, ఆ తర్వాత వరి కొనుగోలు కేంద్రాల్లో పనులు చేస్తూ సంపాదించుకుంటున్నారు. ఇటీవల మండలంలోని కొనుగోలు కేంద్రాలతో పాటు రైస్ మిల్లుల్లో పనిచేసేందుకు వచ్చిన పలువురు బిహారీ కూలీలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. 100 కిలో మీటర్ల దూరం నుంచి భార్యాపిల్లలను వదిలి వచ్చిన వారు ఇక్కడ కూలీ పనులు చేస్తున్నారు. చెన్నూర్ మండలంలోని ఆస్నాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 మంది బిహార్ కూలీలు పని చేస్తున్నారు.
15 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద గుడారాలు వేసుకొని వంటావార్పు చేసుకుంటున్నారు. క్వింటాల్ ధాన్యం కాంటా వేసి, సంచులు నింపి, లారీలో లోడ్ చేస్తే ఒక్కో బస్తాకు రూ.30 నుంచి రూ.40 వరకు ఇస్తున్నారు. పలు రైస్ మిల్లులో కూడా ఎంతో మంది బిహార్ కూలీలు పనులు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసి మిల్లుకు వచ్చిన లారీల్లోని ధాన్యాన్ని అన్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగి వరినాట్లు కొనసాగుతుండగా.. ఆ పనులూ చేస్తున్నారు. మళ్లీ యాసంగిలో వరి కోతలు కాగానే వచ్చి మరో 45 రోజులు ఉపాధి పొందుతారు. వరి కోతలు ప్రారంభమయ్యే సమయంలో బిహార్ నుంచి కూలీలను మన రాష్ర్టానికి పిలిపించుకుంటున్నారు. తెలంగాణలో ఉపాధి దొరకడంతో బిహారీలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి సైతం కూలీలు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. మండలంలోని పలు మిల్లుల్లో ఇప్పటికే ఇతర రాష్ర్టాల కూలీలుగా పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు.
కూలీపని కోసం వచ్చాం..
మేము బిహార్ నుంచి ఇక్కడికి కూలీ పనుల కోసం వచ్చాం. ధాన్యం కొనుగోలు కేంద్రంలో మాకు పని దొరికింది. ప్రతిరోజూ రూ. 800 నుంచి రూ.1500 వరకు డబ్బులు మిగులుతున్నాయి. ప్రతిరోజూ పని ఉంటుంది. ఈ సీజన్ వరకు ఉండి, అయిపోగానే బిహార్ వెళ్లిపోతాం. మళ్లీ పనులుంటే వచ్చే సీజన్లో వస్తాం. బిహార్‌లో సక్రమంగా పనులు దొరకవు, దొరికినా అంతంత మాత్రమే. మేము నాలుగేండ్ల నుంచి ఇక్కడికి పనులకు వస్తున్నాం. ఇక్కడి వారు మమ్మల్ని గౌరవిస్తూ సహకరిస్తున్నారు. మాకు ఎప్పటికీ ఇక్కడే పని చేయాలని ఉంది.
– రూపేశ్, కూలీ, బిహార్
చేతి నిండా డబ్బులు కనిపిస్తున్నాయి..
మేము సుమారు 160 కిలో మీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మాకు ప్రతిరోజూ పని ఉంటుంది. ఏ రోజు చేసిన పనికి ఆ రోజు డబ్బులు చేతికి ఇస్తున్నారు. దీంతో మా చేతిలో డబ్బులు కనిపిస్తున్నాయి. 45 రోజుల పాటు మాకు చేతి నిండా పని దొరికింది. బిహార్‌లో ఎంత పని చేసినా రూ.400 నుంచి రూ.500 వరకే వచ్చేవి. వ్యవసాయ పనులు ఎక్కువ ఉండవు. ఇక్కడ ఇప్పుడు రోజూ రూ.1500 వరకు దొరుకుతున్నాయి. తెలంగాణకు వచ్చి పని చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరితో కలిసి మెలిసి ఉంటున్నాం. ఇక్కడే గుడారాలు వేసుకున్నాం.
– సంబు, కూలీ, బిహార్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- Labors
- rice mills
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

