Wet crops | ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన
రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి దిలీప్ కుమార్ సూచించారు.
రెబ్బెన నవంబర్ 20 : ప్రస్తుత ఎల్ నీనో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు నీటి లభ్యతలో అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని ఈ రబీ సీజన్లో రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి దిలీప్ కుమార్ సూచించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జి జిల్లా రెబ్బెన మండలంలోని కొండపల్లి, ఎడవెల్లి గ్రామాలలో శుక్రవారం రెబ్బెన ఆధ్వర్యంలో ఆరుతడి పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న, జొన్న, పెసర, శనగ తదితర పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, ఒకే పంటపై ఆధారపడే పరిస్థితి తగ్గి, చీడపీడల ఉధృతి పంట నష్టాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని రైతులకు వివరించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక నీటి యాజమాన్య పద్ధతులను రైతులు వినియోగించుకోవాలని సూచించారు.
పంటల వైవిధ్యీకరణ కార్యక్రమం కింద అర్హత కలిగిన రైతులకు సబ్సిడీపై విత్తనాలు అవసరమైన ఇతర వ్యవసాయ ఇన్పుట్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రైతులు వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, నేల స్వభావం, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సరైన పంటను ఎంపిక చేసుకోవాలని, మరింత సమాచారం కోసం సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కృపమని, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
O.M Review | ధనుష్ ‘ఓం’ రివ్యూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే!
Kotha Prabhakar Reddy | సీఎం హుందాతనాన్ని కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Rajapeta | గురుకుల పాఠశాలలో మళ్లీ జూనియర్లపై కట్టెలతో సీనియర్ల దాడి, ముగ్గురికి తీవ్ర గాయాలు
‘ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తెలుపాలి’
Samantha Ruth Prabhu | తల్లిదండ్రులైన సమంత – రాజ్ నిడిమోరు.. కొడుకుకు ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

