Tigers | పులుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యత సాధ్యం : దేవిదాస్
పులుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యత సాధ్యం అవుతుందని ఆసిఫాబాద్ అటవీ డివిజన్ అధికారి దేవిదాస్ అన్నారు.
ఆసిఫాబాద్ టౌన్,జూలై29 : పులుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యత సాధ్యం అవుతుందని ఆసిఫాబాద్ అటవీ డివిజన్ అధికారి దేవిదాస్ అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని(International Tiger Day) పురస్కరించుకుని మంగళవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని తెలిపారు. పోడుసాగు వల్ల అటవీ విస్తీర్ణం తగ్గడంతో పులుల సంరక్షణ కష్టంగా మారిందన్నారు. దీనికి అడవులను నరకకుండా ఉండడమే పరిష్కారం అని అన్నారు.
జిల్లాలోని గిరిజనులకు పలుచోట్ల వెదురుతో వస్తువుల తయారీపై అవసరమైన శిక్షణ అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివాసీలకు అటవీశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా కార్యాలయం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ హెడ్ క్వార్టర్స్ మీదుగా ఎమ్మెల్యే ఇంటి నుండి సబ్ జైలు మీదుగా కార్యాలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్, డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేష్, ఝాన్సీరాణి, విజయ్ ప్రకాష్, సెక్షన్ అధికారులు మహేందర్, విజయ్, సతీష్, బీట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

