రైతుబంధుకు మొండిచేయేనా..!
రైతుబంధు రాకపోవడంపై జిల్లా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐదెకరాల లోపు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయమందిందని కాంగ్రెస్ చెబుతున్నా, అసలు నాలుగెకరాలున్నవారికే ఇప్పటి దాకా దిక్కు లేదని రైతులు మండిపడుతున్నారు.
- యాసంగి పంటలు చేతికొస్తున్నా అందని పెట్టుబడి సాయం
- ఇప్పటి వరకు మూడెకరాలకు మించి ఇవ్వని సర్కారు
- శాటిలైట్ సర్వే పేరిట కొత్త నిబంధనలు తెచ్చే యోచన
- ఐదెకరాల పైనున్న వారు ఆశలు వదులుకోవాల్సిందేనా..!
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/పెంచికల్పేట్, ఏప్రిల్ 21 : రైతుబంధు రాకపోవడంపై జిల్లా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐదెకరాల లోపు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయమందిందని కాంగ్రెస్ చెబుతున్నా, అసలు నాలుగెకరాలున్నవారికే ఇప్పటి దాకా దిక్కు లేదని రైతులు మండిపడుతున్నారు. ఈ పథకం అమలుపై కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు తెలుస్తుండగా, ఇక రైతుబంధుకు రాం.. రాం.. తప్పదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాటిలైట్ ద్వారా సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయనేది స్పష్టంగా తెలుసుకొని.. ఆపై రైతుబంధు ఇవ్వాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, ఈ పథకంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతాంగం ఆశలు వదులుకొనే పరిస్థితి దాపురిస్తున్నది.
యాసంగి పంటలు చేతికొస్తున్నా..
ఐదెకరాల్లోపు రైతుబంధు అందించామని చెబుతున్న కాంగ్రెస్ సర్కారు.. ఆ పైన భూములున్న వారికి మాత్రం మొండిచేయి చూపుతున్నది. యాసంగి పంటలు వేసే సమయంలో పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా, ప్రస్తుతం పంటలు చేతికి వస్తున్నా.. పైసా దిక్కు లేదని రైతులు మండిపడుతున్నారు. గతేడాది యాసంగిలో కేసీఆర్ సర్కారు జిల్లాలోని 1,31,518 మంది రైతులకు దాదాపు రూ. 128 కోట్లు ప్రభుత్వం అందించింది. కానీ, ఈ యాసంగిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రైతుబంధు అందించలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిబంధనల పేరిట సర్వేలు చేయిస్తే అనేక సమస్యలు తెరపైకి వస్తాయని, రైతుబంధు పథకంపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతుబంధు డబ్బులు రాలే
నాకు నాలుగెకరాల భూ మి ఉంది. గతేడాది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పు డు ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ. 20 వేలు నా బ్యాంకు ఖాతాలో పడ్డయి. కానీ ఈ యా సంగిలో కాంగ్రెస్ సర్కా రు ఇప్పటికీ పెట్టుబడి సా యం అందించలేదు. అప్పు లు చేసి పంటలేసిన. రైతుబంధు వస్తదనే నమ్మకం లేకుంటైంది. మున్ముందు ఎలాంటి సాకులు చెప్పి రైతుబంధు ఆపేస్తరోనని అనుమానంగా ఉంది.
– శంకర్, రైతులు, పెంచికల్పేట్
రైతుబంధు ఉంటదో… పోతదో..
రైతుబంధు అమలుపై మా కు నమ్మకం పోతుంది. కాం గ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తప్పుచేశామనిపిస్తోంది. రైతుబంధు అమలుపై ఇన్ని రకా ల ఇబ్బందులు పెడుతదనుకోలే. కేసీఆర్ సర్కారులో సమయానికి డబ్బులు అందినయి. ఇప్పుడు కొత్త సర్వేలు చేపట్టి రైతుబంధు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే అసలు రైతుబంధు పథకం ఉంటదో.. పోతదో అన్న అనుమానం కలుగుతుంది.
-పోషన్న, రైతు, పెంచికల్పేట్
సాయం అందించిన తర్వాతే సర్వే చేయాలి
కెరమెరి, ఏప్రిల్ 21 : శాటిలైట్ సర్వే కు సమయం పడుతోంది. అప్పటి వరకు సాగు చేస్తున్న భూములకు పెట్టుబడి సాయం అందించాలి. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. జూన్ 4న ఫలితాలు వస్తాయి. అప్పటి వరకు వానకాలం సీజన్ వస్తుంది. ఇగ ఆ సమయంలో సర్వేలు చేపడితే రైతుబంధు ఎప్పుడిస్తరు. అవసరమనుకుంటే పెట్టుబడి సాయం అందించిన తర్వాతే సర్వేలు నిర్వహించాలి. అంతేగాని సర్వేల పేరిట కాలయాపన చేసి రైతులకు నష్టం చేయవద్దు.
– కేంద్రే బాలాజీ, రైతు, ధనోర, కెరమెరి
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

