సీఎం పర్యటన సక్సెస్ చేయాలి
ఈ నెల 24న జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సకు, కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు పేర్కొన్నారు.
- జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆత్రం సక్కు
- ఆసిఫాబాద్ కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావుతో కలిసి బహిరంగ సభా స్థలం పరిశీలన
- ఏర్పాట్లపై అధికారులకు సూచనలు
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూన్ 14: ఈ నెల 24న జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సకు, కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి బుధవారం వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 24న ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వాహనాల పారింగ్కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ శ్రీనివాస్, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, సీఐలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

