రైతుల గుండెల్లో విత్తన గబులు
కాంగ్రెస్ సర్కారు వచ్చిందో లేదో అలా కష్టాలు మొదలయ్యాయి. రాంగ రాంగనే అవస్థలను మోసుకొచ్చింది. వానకాలం ప్రారంభం కాక ముందే రైతన్నలకు విత్తనాల కోసం చుక్కలు చూపిస్తున్నది.
- పత్తి ఇత్తుల కోసం దుకాణాల ఎదుట భారీ బారులు
- వేకువ జాము నుంచే పిల్లలు, వృద్ధులు, మహిళల క్యూ
- విత్తనాలు వచ్చాయని తెలియడంతో తరలివచ్చిన రైతులు
- మండుటెండలో దాదాపు నాలుగు గంటలపాటు పడిగాపులు
- పోలీసు బందోబస్తు మధ్య రెండు ప్యాకెట్ల చొప్పున పంపిణీ
- విత్తనాలు దొరకక నిరాశతో వెనుదిరిగిన కొందరు రైతన్నలు
- కాంగ్రెస్ హయాంలో పదేండ్ల క్రితం నాటి బారులు దర్శనం
ఆదిలాబాద్, మే 28(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు వచ్చిందో లేదో అలా కష్టాలు మొదలయ్యాయి. రాంగ రాంగనే అవస్థలను మోసుకొచ్చింది. వానకాలం ప్రారంభం కాక ముందే రైతన్నలకు విత్తనాల కోసం చుక్కలు చూపిస్తున్నది. ఈ పాటికే స్టాక్ పెట్టి, సజావుగా అందించాల్సిన హస్తం సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. అవసరమైన విత్తనాలను సరిపడా అందుబాటులో ఉంచకపోవడంతో రైతన్నలు గుబులు చెందుతున్నారు. వారం రోజుల్లో రుతుపవనాలు వస్తాయని, వర్షాలను మోసుకొస్తాయని వాతావరణ శాఖ తీపి కబురు అందిస్తుండగా.. విత్తనాల కోసం దుకాణాల వద్దకు రైతులు పరుగులు పెడుతున్నారు. ఎండనకా.. వాననకా వేకువజాము నుంచే గంటల తరబడి బారులుదీరుతున్నారు. దుకాణాదారులు కూడా స్టాక్ తక్కువగా రావడంతో వచ్చిన విత్తనాలను పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా మంగళవారం స్టాక్ వచ్చిందని తెలిసిన వెంటనే రైతులు దుకాణాల వద్దకు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు మధ్య విత్తనాలను పంపిణీ చేశారు. వ్యాపారుల వద్ద ఉన్న విత్తనాలను రెండేసి ప్యాకెట్ల చొప్పున పంపిణీ చేయగా.. కొందరు రైతులకు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పత్తి విత్తనాల కోసం రైతులు గోస పడుతున్నారు. 280 మంది డీలర్ల వద్ద వివిధ కంపెనీలకు చెందిన చెందిన ఆరు లక్షల బీటీ పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ అవసరమైన వాటి కొరత ఉంది. జిల్లాలో ఈ ఏడాది వానకాలంలో 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగువుతుండగా.. 10 లక్షల విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు అంటున్నారు. రైతులు భూములు, వర్షాలు, వాతావరణ పరిస్థితులు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విత్తనాలను ఎంపిక చేసుకుంటారు. ఆర్సీహెచ్ 659 విత్తనాల ద్వారా ఆశించిన దిగుబడి వస్తుండడంతో రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలానికి భూములను సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాల సేకరణలో పడ్డారు. ఇతర కంపెనీల బీటీ-2 విత్తనాలను తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. వారం రోజుల నుంచి వారికి కావాల్సిన విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు.
భారీగా తరలివచ్చిన రైతులు
రైతుల డిమాండ్ మేరకు వ్యవసాయశాఖ అధికారులు ఆర్సీహెచ్ 659 విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం 27 వేల విత్తన ప్యాకెట్ల స్టాక్ రాగా.. జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో విక్రయాలు జరిగాయి. విత్తనాలు వచ్చిన విషయం తెలుసుకున్న రైతులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. పట్టణంలోని 13 వేల విత్తన ప్యాకెట్లను విక్రయించడానికి చర్యలు తీసుకున్నామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. రైతుల రాకతో దుకాణాల్లో భారీ రద్దీ నెలకొన్నది. వందల సంఖ్యలో రైతులు క్యూలో నిలబడ్డారు. విత్తనాల పంపిణీ సందర్భంగా ఆందోళనలు జరగకుండా పోలీసులు పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు. వ్యాపారులు పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. అధికారులు విత్తనాల పంపిణీ ప్రారంభించినా రైతులకు సరిపడా అందలేదు. ప్రతి రైతుకు రెండు ప్యాకెట్లను మాత్రమే ఇచ్చారు. మూడు, నాలుగు గంటలు మండుటెండలో పడిగాపులు కాశారు. కొన్ని దుకాణాల్లో గంట వ్యవధిలోనే వ్యాపారులు అమ్మకాలను పూర్తి చేశారు. తమకు వచ్చిన స్టాక్ మేరకు అమ్మకాలు జరిపామని పేర్కొన్నారు. దీంతో క్యూలైన్లో నిల్చున్న రైతులు నిరాశతో వెనుదిరుగాల్సిన పరిస్థితి నెలకొన్నది. పది ప్యాకెట్లు అవసరమున్న రైతులకు రెండు మాత్రమే లభించడంతో వారు నిరాశతో వెనదిరిగారు. మరో పది రోజుల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని చినుకు పడగానే తాము విత్తనం వేస్తామని, తమకు సరిపడా విత్తనాలు అందకపోతే ఏమి చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మూడు గంటలు నిలబడ్డా.. ఇత్తులు దొరుకలే..
నాపేరు ప్రవీణ్. నాకు ఆదిలాబాద్ జిల్లాలోని కప్పర్ల గ్రామంలో ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. నేను యేటా వానకాలంలో పత్తి విత్తనాలు వేస్తా. ఆదిలాబాద్‌కు నాలుగు రోజుల నుంచి విత్తనాల కోసం తిరుగుతున్నా. రాకపోవడంతో వెనుదిరిగి ఇంటికొస్తున్నా. మంగళవారం విత్తనాలు వచ్చాయని మా ఊరు నుంచి ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి దుకాణం ఎదుట నిలబడ్డా. నా కంటే ముందుగానే చాలా మంది రైతులు రావడంతో లైన్ పెద్దగా ఉంది. పది గంటలకు అమ్మకాలను ప్రారంభించిన వ్యాపారి గంటలోనే అయిపోయాయని చెప్పిండు. నావరకు రాకుండానే విత్తనాలు అయిపోయాయి. మూడు గంటలు లైన్లో నిల్చున్నా దొరకలేదు. వ్యాపారిని అడిగితే మాకు సప్లయి తక్కువగా ఉంది. వచ్చిన విత్తనాలు అమ్మేశామని చెప్పిండు. ఇగ మా బాధ ఎవరికీ చెప్పుకోవాలి. విత్తనాల కోసం రైతులు గోస పడడం పదేండ్ల క్రితం చూసిన. ఇప్పుడు మళ్లీ చూస్తున్న. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు విత్తనాల కోసం ఇంత గోస పడలేదు. ఈ కాంగ్రెస్ సర్కారోళ్ల కాలంలో మస్తు ఇబ్బంది పడుతున్నం. అధికారులు స్పందించి అవసరమైన విత్తనాలను పంపిణీ చేయాలి. లేకపోతే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
లాఠీచార్జి జరపలేదు.. ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కొనుగోలు కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జి జరపలేదని ఎస్పీ గౌష్ ఆలం ఒక ప్రకటనలో తెలియజేశారు. రైతుల బాగు కోసం అపాయం జరగకుండా రైతులందరినీ ఒక క్రమబద్ధీకరణతో ఉంచడానికి విధులు నిర్వర్తిస్తుంటారనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు ఆదిలాబాద్‌లో ఏర్పడలేదన్నారు. ఆందోళనకర అవాస్తవ వార్తలను ప్రచురించి, ప్రశాంతమైన రైతులకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకురాకూడదన్నారు. అవాస్తవమైన వార్తలు, స్క్రోలింగ్‌లను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

