బొగ్గు గనుల వేలం ఆపాలి
మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గుబ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపాలని, నేరుగా సింగరేణి కంపెనీకి అప్పగించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు.
- సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ డిమాండ్
- బీజేపీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఎదులాపురం, జూన్ 29 : మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గుబ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపాలని, నేరుగా సింగరేణి కంపెనీకి అప్పగించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మల్లేశ్ మా ట్లాడుతూ.. గతంలోనే మోదీ ప్రభుత్వం నాలుగు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించిందని మండిపడ్డారు.
బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి హైదరాబాద్ కేంద్రంగానే వేలం పాట ప్రక్రియను ప్రారంభించడం అన్యాయం అన్నారు. బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదేముందన్నారు. క్రమంగా సింగరేణి సంస్థ బలహీనబడి మూతపడే వైపు మోదీ ప్రభుత్వం నెట్టుతున్నదన్నారు. ఈ ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలని సీపీఎం పార్టీ కోరుతుందన్నారు. తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని కాపాడుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కదలాలని కోరారు.
పదేండ్లలో మోదీ ప్రభుత్వం సుమారు 200 బొగ్గు బావులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిందన్నారు. రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మెదపడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు బండి దత్తాత్రి, కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు, కిరణ్, సచిన్, నాయకులు మంజుల, స్వామి, ఆశన్న, పొచక్క, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- auction
- BJP
- Coal Mines
- Mallesh
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

