Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
Maruti Patel Dongre | రాష్ట్రంలో విద్యుత్ కోతల తో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ఇంద్రవెల్లి మండల అధ్యక్షుడు మారుతి పటేల్ డోంగ్రే ఆరోపించారు.
ఇంద్రవెల్లి : రాష్ట్రంలో విద్యుత్ కోతల ( Power Shortage ) తో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ఇంద్రవెల్లి మండల అధ్యక్షుడు మారుతి పటేల్ డోంగ్రే ( Maruti Patel Dongre ) ఆరోపించారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ సరఫరా సరిగా లేక రైతుల పెట్టుబడులు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంట్ కోతల కారణంగా మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆరోపించారు. విద్యుత్ కోతలకు ఎల్‌నినో కారణమని చెప్పి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి, యాదాద్రి వంటి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం బొగ్గు సరఫరాను సమర్థంగా నిర్వహించడంలో విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణ విద్యుత్ వ్యవస్థకు సింగరేణి కీలకమని, సంస్థను బలహీనపరిస్తే రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. సింగరేణిలో టెండర్లు, సైట్ విజిట్ సర్టిఫికెట్ల వ్యవహారాలు, సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జిలానీ బేగ్, లఖన్ సింగ్, సుఫియాన్, అంజద్, సుమీత్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
Donation | కొమురం భీమ్ విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ నాయకుడు విరాళం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

