మందుబాబులకు అడ్డాగా పార్కు
పాతమంచిర్యాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పార్కు మందుబాబులకు అడ్డాగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండానిత్యం పదుల సంఖ్యలో మం దుబాబులో పార్కులోనే తిష్టవేస్తున్నారు. ఊరుకు చివరగా ఉండడం, వాచ్మెన్ లేకపోవడం, కూర్చునేందుకు అనుకూలంగా ఉండడం, నీడనిచ్చే చెట్లు ఉండడంవంటి అంశాలు మద్యం ప్రియులకు కలిసివస్తున్నది.
- ఆలనా పాలనా లేక అధ్వానం
- ఎటు చూసినా మద్యం, కూల్ డ్రింక్ బాటిళ్లు
- ఇబ్బందుల్లో స్థానికులు
మంచిర్యాలటౌన్, జూన్ 19 : పాతమంచిర్యాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పార్కు మందుబాబులకు అడ్డాగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండానిత్యం పదుల సంఖ్యలో మం దుబాబులో పార్కులోనే తిష్టవేస్తున్నారు. ఊరుకు చివరగా ఉండడం, వాచ్మెన్ లేకపోవడం, కూర్చునేందుకు అనుకూలంగా ఉండడం, నీడనిచ్చే చెట్లు ఉండడంవంటి అంశాలు మద్యం ప్రియులకు కలిసివస్తున్నది. ఏ అకేషన్ ఉన్నా ఇక్కడికి వచ్చి మ ద్యం తాగడం పరిపాటిగా మారింది. మద్యం, వాటర్, కూల్డ్రింక్ బాటిళ్లు, ఆహార పదార్థాల కవ ర్లు ఇక్కడే వదిలేసి పోతుండడంతో డంప్యార్డును తలపిస్తున్నది. పార్కులో ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి.
పట్టణ వాసులకు ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని కల్పించడం కోసం కోట్లాది రూపాయ లు వెచ్చించి నిర్మించిన పార్కు ఆలనాపాలనా లేక అధ్వానంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. పాతమంచిర్యాలతో పాటు పట్టణంలోని బాలుర పాఠశాల మైదానం, డిగ్రీ కళాశాల మైదా నం, చెరువు కట్టలపై ఇలా బహిరంగంగా మద్యం సేవించడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ విషయమై సోమవారం పాతమంచిర్యాల నివాసి సోషల్మీడియాలో పోస్టు పెట్టడం వైరల్గా మారింది. మున్సిపల్ అధికారులు పార్కు విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

