ఇంద్రవెల్లి, జూలై 23 : ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి అందునాయక్తండా గ్రామం వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.28 లక్షలతో బీటీరోడ్డు నిర్మించడంతో గ్రామస్తులకు రవాణా కష్టాలు తీరాయి. అందునాయక్తండా గ్రామంలో 145 కుటుంబాలు ఉండగా 450 మంది జనాభా ఉన్నారు. గత పాలకులు అందునాయక్తండా గ్రామాభివృద్ధిని పట్టించుకోలేదు. అధ్వానంగా మారిన రోడ్డుతో మండల కేంద్రానికి రావాలంటే గంటల తరబడి సమయం పట్టేది. అత్యవసర సమయంలో రోగులు, గర్భిణులు, బాలింతలను వైద్యం కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించాలంటే తీవ్ర ఇబ్బంది పడేవారు. తమ గ్రామానికి బీటీరోడ్డు నిర్మించాలని గత పాలకులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోలేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసింది. అప్పటి ఎంపీ నగేశ్ కుడా నిధులు మంజూరు చేయించడంతో బీటీరోడ్డు నిర్మించారు. కాని రోడ్డుపై గుంతలు పడి అధ్వానంగా మారిందని గ్రామస్తులు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు విన్నవించడంతో తిరిగి రెండోసారి అందునాయక్తండాకు రూ.28లక్షలు మంజూరు చేయడంతో బీటీ రోడ్డు నిర్మించారు. గ్రామస్తులతో పాటు రుషి పంచమి ఉత్సవాలకు వచ్చే భక్తులు సైతం ప్రభుత్వ పని తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
60 సంవత్సరాలకు బీటీరోడ్డు నిర్మాణం
అదునాయక్తండా గ్రామానికి 60 సంవత్సరాల తర్వాత బీటీ రోడ్డు నిర్మించారు. గత పాలకులు తమ గ్రామాన్ని పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పిస్తున్నది. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో మండల కేంద్రానికి రాకపోకలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. బీటీరోడ్డు నిర్మించడంతో గ్రామానికి అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఎమ్మెల్యే రేఖానాయక్‌తో పాటు అప్పటి ఎంపీ నగేశ్‌కు గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
–పడ్వాల్ గోపాల్‌సింగ్, వైస్‌ఎంపీపీ
గ్రామస్తుల కష్టాలు తీర్చాం
అందునాయక్తండాకు చెందిన గ్రామస్తుల సమస్యలు పరిష్కరించాం. రాష్ట్ర ప్రభుత్వం అందునాయక్తండాకు బీటీరోడ్డు నిర్మించడంతో ప్రజల కష్టాలు తీరాయి. అప్పటి ఎంపీ నగేశ్‌తో పాటు ఎమ్మెల్యే రేఖానాయక్ గ్రామస్తుల విన్నపం మేరకు 28లక్షలతో బీటీరోడ్డు నిర్మించారు. గత ప్రభుత్వాలు గ్రామాన్ని పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పించింది.
–మారుతిపటేల్డోంగ్రే, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్