కన్నీరే మిగిలింది..
ఆదిలాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ) ః “సారూ.. నా పేరు ప్రతిభ. నన్ను సర్కారోళ్లు కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ పది రోజుల క్రితం ప్రీ ప్రైమరీ పాఠశాలల ఇన్‌స్ట్రక్టర్‌గా ఆదిలాబాద్ అర్బన్ మండలంలోని బంగారుగూడ ఎంపీపీఎస్ పాఠశాలకు పంపించారు. ఈ నెల 18 నుంచి 10 రోజులపాటు విధులు నిర్వహించా. 22 మంది పిల్లలను చేర్పించి తరగతులు ప్రారంభించాం. నన్ను అకారణంగా తొలగించి వేరే అభ్యర్థికి ఎక్కువ అర్హతలున్నాయని తన స్థానంలో నియమించారు.
- సర్కారోళ్లు ఉద్యోగమిచ్చి.. ఊడగొట్టారు..
- నేను చేసిన పాపం ఏందని కన్నీరు..
- ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు
ఆదిలాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ) ః “సారూ.. నా పేరు ప్రతిభ. నన్ను సర్కారోళ్లు కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ పది రోజుల క్రితం ప్రీ ప్రైమరీ పాఠశాలల ఇన్‌స్ట్రక్టర్‌గా ఆదిలాబాద్ అర్బన్ మండలంలోని బంగారుగూడ ఎంపీపీఎస్ పాఠశాలకు పంపించారు. ఈ నెల 18 నుంచి 10 రోజులపాటు విధులు నిర్వహించా. 22 మంది పిల్లలను చేర్పించి తరగతులు ప్రారంభించాం. నన్ను అకారణంగా తొలగించి వేరే అభ్యర్థికి ఎక్కువ అర్హతలున్నాయని తన స్థానంలో నియమించారు.
కొత్తగా నియమించిన అభ్యర్థి ఎంపిక ప్రక్రియ గడువులోగా మొత్తం పత్రాలు సమర్పించలేదు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత సదరు అభ్యర్థి కలెక్టర్‌కు ఇవ్వగా వాటిని పరిగణలోకి తీసుకొన్నారు. దీంతో నన్ను తొలగించారు.” అని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షాకు కన్నీరు పెట్టుకుంటు తెలిపింది. ఈ విషయంలో ఏమీ చేయలేమని, మీరు ఉద్యోగం వదులుకోవాలని కలెక్టర్ సూచించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించిన తనకు న్యాయం చేయాలని ప్రతిభ డిమాండ్ చేస్తున్నది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?