కాగజ్నగర్ రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు బతుకమ్మ సారెను అందజేస్తున్నారని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలో పొట్టి శ్రీరాములు చౌరస్తా, మండలంలోని కోసిని గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు రాష్ట్రంలో షీటీంల ఏర్పాటు, ఆడబిడ్డల పెండ్లిళ్లకు కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా చేయూతను అందిస్తున్నారని పేర్కొన్నారు.
మహిళల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, దేశంలోనే మహిళల సంక్షేమం కోరే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, కమిషనర్ సీవీఎన్ రాజు, కౌన్సిలర్లు విద్యావతి, బంకశివ, మహిళలు లబ్ధిదారులు పాల్గొన్నారు.