పులి దాడిలో చుక్కల దుప్పి మృతి !
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ సమీపంలోని గాంధారి ఖిల్లా వద్ద అటవీ ప్రాంతం మిడిచెరువు కట్టపై పులి దాడిలో చుక్కల దుప్పి మృతి చెందినట్లు తెలిసింది.
- పులి ఆనవాళ్లు కనిపించలేదు : అటవీ శాఖ అధికారులు
రామకృష్ణాపూర్, జూన్ 5 : మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ సమీపంలోని గాంధారి ఖిల్లా వద్ద అటవీ ప్రాంతం మిడిచెరువు కట్టపై పులి దాడిలో చుక్కల దుప్పి మృతి చెందినట్లు తెలిసింది. బుధవారం ఉపాధి హామీ పనులకు కూలీలకు చుక్కల దుప్పి కనిపించడంతో అధికారులకు సమాచారం అందించారు. వెంటనే లక్షెట్టిపేట్ ఎఫ్ఆర్వో నగావత్ స్వామి, మేడారం, గఢ్పూర్, పాత మంచిర్యాల సెక్షన్ సిబ్బంది, పశువైద్యాధికారులు అక్కడికి వెళ్లి కళేబరాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు.
చెరువు కింద ఉన్న చెలిమ వద్దకు నీటి కోసం వచ్చిన చుక్కల దుప్పిని పులి చంపి ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై లక్షెట్టిపేట్ ఎఫ్ఆర్వో నగావత్ స్వామిని వివరణ కోరగా నీటి కోసం వచ్చిన దుప్పిని రేసుకుక్కలు చంపి ఉంటాయని తెలిపారు. పులి ఆనవాళ్లు ఇక్కడ కనిపించలేదని తెలిపారు. మూడు నెలల క్రితం ఇక్కడ చిరుత పులి సంచరించినప్పటికీ ప్రస్తుతం ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు. ఆయన వెంట బీట్ ఆఫీసర్ రత్న సింధు, సెక్షన్ ఆఫీసర్లు అత్తహుల్లా, హమ్మద్ ఉన్నారు. గాంధారి ఖిల్లా అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పి మృతితో పులి సంచరిస్తున్నదనే ప్రచారం జరగడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

