మూగ వేదన
జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది.
- జిల్లాలో జోరుగా పశువుల అక్రమ రవాణా
- గుట్టుచప్పుడుకాకుండా కంటెయినర్లలో తరలింపు
- కిక్కిరిసి ఎక్కిస్తుండడంతో ఊపిరాడక చనిపోతున్న మూగజీవాలు
- అధికారుల తీరుపై ఆరోపణలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. కొందరైతే అడవుల్లో మేతకు వెళ్లిన పశువులను దొంగతనంగా తీసుకొచ్చి వాహనాల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇక వాహనాల్లో కిక్కిరిసి ఎక్కించడం వల్ల ఊపిరాడక పశువులు మృత్యువాత పడుతున్నాయి.

సంతల్లో కొనుగోలు చేసి.. రాత్రి వేళల్లో తరలింపు
మహారాష్ట్ర-సిర్పూర్-టీ అంతర్రాష్ట్ర రహదారి మీదుగా సిర్పూర్-టీ, కౌటాల, గూడెం, చింతలమానేపల్లి, పెంచికల్పేట్, కడంబా, కాగజ్‌నగర్ క్రాస్‌రోడ్డు మీదుగా, వాంకిడి నుంచి ఆసిఫాబాద్ మీదుగా హైదరాబాద్.. కరీంనగర్ తదితర పట్టణాలకు పశువులను కంటెయినర్లలో తరలిస్తున్నారు. జిల్లాలోని వాంకిడి, కౌటాల, జైనూర్, సిర్పూర్ మండలాల్లోని పశువుల సంతల్లో, మహారాష్ట్రలోని గోయగాంలోని వారసంతలో దళారులు పశువులను కొనుగోలు చేసి రాత్రి వేళ్లల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. సిర్పూర్-టీ నుంచి కాగజ్‌నరగ్ వరకు, రెబ్బెన నుంచి మంచిర్యాల జిల్లా దాటేవరకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని దందా సాగిస్తున్నారు. తరలింపు సమయంలో పోలీసులు తనిఖీల విషయాన్ని ఏజెంట్లు దళారులకు అందిస్తుంటారు. దొంగదారుల్లో పశువులను పట్టణాలకు తరలిస్తుంటారు. జిల్లాలో రెండు మూడు రోజులకో చోట ఈ ఘటన వెలుగుచూస్తున్నది. అధికారులను మచ్చిక చేసుకొని పశువులను అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

తీరుమార్చిన స్మగ్లరు..
గతంలో వ్యాన్లు, ట్రక్కులు, లారీల్లో పశువులను అక్రమంగా తరలించిన స్మగ్లరు ఇప్పుడు కంటెయినర్లు వాడుతున్నారు. పరిమితికి మించి కంటెయినర్లలో కిక్కిరిసి ఎక్కించడం వల్ల మూగ జీవాలు ఊపిరాడక మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల రెబ్బెనలో పట్టుబడ్డ కంటెయినర్లో 24 పశువులను ఎక్కించగా, అందులో 9 మృత్యువాత పడ్డాయి. రెబ్బెనలోని ఏవో బ్రిడ్డి సమీపంలోని అడవిలో చనిపోయిన పశువులను పడేసేందుకు కంటెయినర్‌ని ఆపగా, అదే సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులు గమనించి వాహనాన్ని పట్టుకున్నారు. కంటెయినర్లలో ఎంత క్రూరంగా జీవాలను తరలిస్తున్నారనేదానికి ఈ ఘటనే నిదర్శనం. గత నెల 27న వాంకిడి టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో పశువులను తరలిస్తున్న కంటెయినర్‌ని పోలీసులు పట్టుకున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

