Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని బజార్ గల్లీలో ఆర్యవైశ్య సంఘం మహిళలు గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ ( Kubheer ) మండల కేంద్రంలోని బజార్ గల్లీలో ఆర్యవైశ్య సంఘం మహిళలు గురువారం బతుకమ్మ సంబరాలను ( Bathukamma Celebrations ) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, లయబద్ధంగా నృత్యాలు చేస్తూ, కోలాటాలు వేస్తూ సందడి చేశారు. డీజే సంగీతం, చప్పట్ల మధ్య ఉత్సాహం గా సాగిన ఈ వేడుకలు బజార్ గల్లీలో పండుగ వాతావరణాన్ని నింపాయి. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగుల్లో వివిధ రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, స్థానికులు బతుకమ్మ సంబరాలను తిలకించేందుకు తరలివచ్చారు.
పూల పండుగగా పేరుగాంచిన బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఐక్యతను, పరస్పర స్నేహ భావాన్ని పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడుతున్నాయని వేడుకల్లో పాల్గొన్న రెడ్డిశెట్టి సునీత, ప్రణీత అభిప్రాయపడ్డారు. ఈ వేడుకల్లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రెడ్డిశెట్టి నిఖిల్, రెడ్డిశెట్టి సంతోష్, ఆనంద్, ఆర్.నారాయణ్, బాలాజీ , మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

