ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యక్షమైన నాలుగు పులులు.. అటవీశాఖ అధికారులు అప్రమత్తం
Adilabad | ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్‌కు పులులు తారసపడ్డాయి.
భీంపూర్ : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్‌కు పులులు తారసపడ్డాయి.
గుంజాల – గొల్లఘాట్ మార్గంలో వస్తుండగా ఒక పెద్దపులి, మూడు పిల్లలు రోడ్డు దాటుతూ కనిపించాయి. వాటిని చూసి వాహనం ఆపిన డ్రైవర్, వీడియో తీసి అధికారులకు సమాచారం అందించాడు. కాగా, శుక్రవారం ఎఫ్ఆర్వో గులాబ్‌సింగ్, ఎఫ్ఎస్వో అహ్మద్ ఖాన్, ఎఫ్‌బీవోలు గులాబ్, సజన్ లాల్, బేస్ క్యాంపు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గొల్లఘాట్, గుంజాల, పిప్పల్‌కోటి శివార్లలో 10 సీసీ నైట్ విజన్ కెమెరాలు అమర్చామని తెలిపారు. ఒక తల్లి పులి, మూడు పిల్లలు ఉన్నట్లు గుర్తించామని ఎఫ్ఆర్వో గులాబ్ సింగ్ తెలిపారు.

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

