సాహసం.. సేవాభావం
క్రమశిక్షణకే పరిమితమైన ఎన్సీసీ ఇప్పుడు గొప్ప ఉద్యోగావకాశాలకు బాటలు వేస్తోంది. జాతి సమగ్రత, లౌకికవాదాన్ని పరిరక్షించేందుకు ఎన్సీసీ ఎంతో దోహదపడుతుంది.
- విద్యార్థులకు నూరిపోస్తున్న ఎన్సీసీ
- క్రమశిక్షణ జీవన విధానానికి బాటలు
- బాల్యదశ నుంచే మార్పునకు నాంది
- రేపు నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) దినోత్సవం
బేల, నవంబర్ 25: క్రమశిక్షణకే పరిమితమైన ఎన్సీసీ ఇప్పుడు గొప్ప ఉద్యోగావకాశాలకు బాటలు వేస్తోంది. జాతి సమగ్రత, లౌకికవాదాన్ని పరిరక్షించేందుకు ఎన్సీసీ ఎంతో దోహదపడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మంది కళాశాల స్థాయి విద్యార్థులు ఎన్సీసీ శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ పొందిన వారికి దేశ రక్షణ బలగాల్లో సోల్జర్ స్థాయి నుంచి అధికారిగా ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఎన్సీసీ ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి ప్రధాన రిక్రూట్మెం ట్ ఏజెన్సీగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పొందుతున్న అధికారుల్లో 25 శాతం మంది ఎన్సీసీ కోటాలో నియమితులైన వారేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
1917లో మొదలై..
దేశంలో 1917లో ఎన్సీసీని స్థాపించారు. రక్షణ రంగంలో ఉన్న సిబ్బంది కొరత,లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు ఈ చట్టాన్ని తయారు చేసి విశ్వవిద్యాలయాల స్థాయిలో ఎన్సీసీని పటిష్టం చేశారు. తర్వాత అనేక విధాలుగా రూపాంతరం చెందుతూ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో భాగమైంది. ఈ మేరకు ప్రభుత్వం 1948లో 31వ ఎన్సీసీ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చింది. యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా వారిలో లౌకిక భావాలను పెంపొందించడం, సాహసోపేతమైన శక్తిగా తీర్చిదిద్దడం, గొప్ప ఆదర్శ భావాలను వారిలో కలిగించడం, రక్షణ రంగాల్లో చేరేందుకు అనువైన మంచి నడవడిక, నిస్వార్థ సేవ, నాయకత్వ లక్షాణాలను కలిగించడం దీని లక్ష్యం. ఇందుకు పాఠశాల, కళాశాల స్థాయిల నుంచే ప్రోత్సాహం అందిస్తున్నారు. 13 ఏండ్ల వయస్సు దాటిన విద్యార్థులు ఈ కేడెట్లుగా చేరితే ఇంటర్మీడియట్, ఆపై స్థాయి కో ర్సులు చదివే విద్యార్థులు సీనియర్ కేడెట్లుగా శిక్షణ పొందుతారు.
శిక్షణతో రాటుదేల్చి..
యువతను వివిధ రకాల శిక్షణలతో రాటుదేల్చుతున్నది. వయోజనుల అక్షరాస్యత, ప్రమాదకరమైన డ్రగ్స్‌ను వాడకుండా నియంత్రించడం, మొక్కలు నాటి వాతావరణం కాలుష్యం బారిన పడకుండా చూడడంతో పాటు పారా సెయిలింగ్, కార్, మోటార్ సైకిళ్ల ర్యాలీలు, పర్వతారోహణ వంటి అంశాల్లో ఎన్సీసీ తన కేడెట్లకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది.
ఎన్సీసీ సర్టిఫికెట్లు..
ఎన్సీసీలో శిక్షణ పొందిన వారికి మూడు రకాల సర్టిఫికెట్లను అందజేస్తారు. జూనియర్ డివిజన్లో ఒకటి నుంచి రెండు ఏండ్లలో పొందే శిక్షణకు ఏ సర్టిఫికెట్ ఇస్తారు. సీనియర్ డివిజన్లో చేరిన వారికి బీ, సీ సర్టిఫికెట్ ఇస్తారు. విద్యార్థిదశలో వారి జీవిత గమనానికి భవిష్య త్ బాటకు ఎన్సీసీ పునాది వేస్తున్నది. ఎన్సీసీ ద్వారా ఉన్నత విద్యతోపాటు ఉపాధికి అనేక అవకాశాలు పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షలతోపాటు పోలీస్,ఆర్మీ నియామకాల్లో ఎన్సీసీ సర్టిఫికెట్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 24 పాఠశాలలు, 11 కళాశాలల్లో ఎన్సీసీ ఉంది. మొత్తం 2500 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. కళాశాలల స్థాయిలో ఏడాదికి 40 కవాతులు చేస్తారు. ఒక్కో కవాతుకు సుమారు 3 గంటల సమయం ఉంటుంది. సెలవు దినాల్లో మాత్రమే శిక్షణ ఇస్తారు. డ్రిల్, మార్చ్ఫాస్ట్, మాన్ రీడింగ్, కంపాస్, కవాతు, వెపన్, రైఫిల్ విభాగాల్లో శిక్షణ ఉంటుంది. రెండు జతల యూనిఫాంలు, బూట్లు, బెల్ట్, టోపీతో కూడిన సెట్‌ను ఉచితంగా అందిస్తారు. ప్రతి ఏడాది సెలవుల్లో వారం నుంచి పదిరోజులపాటు శిబిరాలు నిర్వహిస్తారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక గుర్తిం పు ఉంటుంది. రాకపోకల ఖర్చులు బెటాలియనే భరిస్తుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధానితో పాటు దేశరాజధానిలో జరిగే వేడుకల్లో కవాతు కోసం కేడెట్లను ఎంపికచేస్తారు.
క్రమశిక్షణే ముఖ్యం
నేటి యువత, విద్యార్థులకు క్రమశిక్షణే ముఖ్యం, సమయపాలన కూడా అవసరం. ఎన్సీసీలో శిక్షణ ద్వారా, ఇవన్నీ అలవడు తాయి. అటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎన్సీసీ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న. ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పించే కార్యక్రమం లోనూ నా బాధ్యత నెరవేరుస్తున్న. శిక్షణలో భాగంగా చాలా అంశాలను నేర్చుకునే వీలు ఉంటుంది. – బీ. ప్రియాంక, ఆదిలాబాద్
రక్షణరంగాల్లో అవకాశం..
విద్యార్థులను సైనికుల్లా తయారు చేసేందుకు ఎన్సీసీ శిక్షణ దోహదం చేస్తుంది. విద్యార్థుల్లో దేశ భక్తి పెంపొందించడం ప్రధాన ఉద్దేశం. యాం టీ ప్లాస్టిక్ ర్యాలీ, సాంస్కృతిక కార్యకమాలతో విద్యార్థుల నైపుణ్యత గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కవాతులో ప్రతిభ చూపిన వారిని గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకలకు పంపిస్తున్నాం. ఎన్సీసీలో సీ సర్టిఫికెట్ పూర్తయిన వారికి రక్షణ రంగాల్లో అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎన్సీసీకి మంచి ఆదరణ ఉంది. బాల్యదశ నుంచే శిక్షణతో మెరికల్లా తయారవుతారు.
– లెఫ్టినెంట్ కల్నల్ వికాస్ శర్మ, ఉమ్మడి జిల్లా ఎన్సీసీ కమాండింగ్ అధికారి
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న..
ఎన్సీసీ ద్వారా క్రమశిక్షణతో పాటు సేవాభావం పెరుగుతున్నది. ఇప్పటి వరకు ఎన్నో శిబిరాల్లో పాల్గొన్న. అక్కడ నేర్చుకున్న విషయాలు భవిష్యత్‌లో ఉపయోగపడతయ్. ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాలకు ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. నేను కూడా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న..
–కళ్యాణి శర్మ, ఆదిలాబాద్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

