Nominations | కాసిపేట మండలంలో మొత్తం 8 నామినేషన్లు దాఖలు
Kasipeta | మండలంలో ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో దశ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది.
కాసిపేట : మండలంలో ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ( Local Elections) లో భాగంగా రెండో దశ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి రోజు నామినేషన్లు స్వల్పంగా నమోదయ్యాయి. మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల (Nominations) స్వీకరణ కోసం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
22 పంచాయతీలకు కాసిపేట, ముత్యంపల్లి, కోమటిచేను, కోనూర్, ధర్మారావుపేట, సోనాపూర్, దేవాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం మొదటి రోజు మొత్తం 22 సర్పంచ్ స్థానాలకు 3 నామినేషన్లు పడ్డాయి. 190 వార్డు స్థానాలకు 5 నామినేషన్లు పడ్డాయి.
కొండాపూర్‌లో ఉత్తూరి వాసవి, కోనూర్‌లో పేరం మల్లేష్, దేవాపూర్‌లో పర్చాకి ఈశ్వర్ సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. వార్డుల్లో కాసిపేట గ్రామ పంచాయతీలో రెండు నామినేషన్లు, కోనూర్‌లో ఒక నామినేషన్, దేవాపూర్‌లో రెండు నామినేషన్ల చొప్పున నామినేషన్లు వేశారు.
ముత్యంపల్లిలో ఏఎస్ఐ బూర రవీందర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామ పంచాయతీల్లో నామినేషన్ కేంద్రాల్లో ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీవో శేఖ్ సఫ్టర్ అలీ, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

