మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Jan 27, 2020 ,

నేడు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

నేడు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక
  • ఎగురనున్న గులాబీ జెండా
  • టీఆర్‌ఎస్‌ గూటికి చేరిన ఇండిపెండెంట్‌లు
  • ఇతర సభ్యులు మద్దతిచ్చేందుకు సిద్ధం

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నేడు జరుగనున్నది. మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మం దిరంలో ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారులు ఆదివారం విడుదల చేశారు. మొదట కొత్తగా ఏర్పడిన పాలకమండలి సమావేశం నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం చైర్మన్‌ ఎన్నిక ఉంటుంది. అనంతరం వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఆదివారం మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డులకు గానూ టీఆర్‌ఎస్‌ 24, బీజేపీ 11, ఎంఐఎం 5, కాంగ్రెస్‌ 5, ఇండిపెండెంట్‌లు గెలుపొందారు. ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్‌లు టీఆర్‌ఎస్‌ గూటికి చేరగా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సైతం టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురనున్నది.

టీఆర్‌ఎస్‌దే చైర్మన్‌ పీఠం

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నేడు జరుగనుంది. ఇందుకోసం అధికారులు మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు 49 వార్డుల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం 12.30 గంటలకు మున్సిపల్‌ సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. ఆదివారం ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం 49 వార్డులకు గానూ టీఆర్‌ఎస్‌ 24, బీజేపీ 11, ఎంఐఎం 5, కాంగ్రెస్‌ 5, ఇండిపెండెంట్‌లు గెలుపొందారు. చైర్మన్‌ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎంపీ జోగు రామన్న, ఎంపీ సోయం బాపురావులు మున్సిపాలిటీలో పేరు నమోదు కోసం లేఖలు అందజేశారు. దీంతో సభ్యుల సంఖ్య 51కి చేరుకోనున్నది. ఫలితంగా చైర్మన్‌ ఎన్నిక కోసం 26 మంది సభ్యుల అవసరం ఉంటుంది. పోలింగ్‌కు ఒక రోజు ముందు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు క్యాంపులో ఉన్నారు. ఇప్పటికే 44 వార్డు నుంచి గెలిపొందిన ఇండిపెండెట్‌ అభ్యర్థి షాహనాజ్‌ బేగం టీఆర్‌ఎస్‌కు గూటికి చేరారు. ఆమె కుమారుడు ఇమ్రాన్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న, టీఆర్‌ఎస్‌ నాయకుడు జోగు మహేందర్‌ కలిసి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్‌లు సైతం టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సైతం టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే జోగు రామన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేయనున్నారు. దీంతో చైర్మన్‌ ఎన్నిక కోసం కావాల్సిన 26 సంఖ్యను సులభంగా అధిగమిస్తుంది. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు మొదటి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఫలితంగా ఆదిలాబాద్‌ మున్సిపాలిటీపై గులాబీ  జెండా ఎగురనున్నది. 


logo
>>>>>>