Reba Monica John
Reba Monica John | శ్రీవిష్ణు (Sree Vishnu) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’ (Samajavaragamana). రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్నారు.
రాజేష్ దండా (Rajesh Danda) నిర్మాత. రెబా మోనికా (Reba Monica John) కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు.
ఇందులో ప్రతి చిన్న విషయానికి చిరాకు పడే యువకుడిగా శ్రీవిష్ణు (Sree Vishnu) కనిపించారు. ప్రేమ, ద్వేషం వెనకున్న కారణాల్ని వివరిస్తూ టీజర్ ఆసక్తిగా సాగింది. కామెడీ ఆకట్టుకునేలా ఉంది.
ఈ సందర్భంగా శ్రీ విష్ణు (Sree Vishnu) మాట్లాడుతూ ‘వినోదాత్మకంగా సాగే సకుటుంబ కథా చిత్రమిది. సినిమా ఆసాంతం నవ్వుతూనే ఉంటారు.
ప్రతి పాత్రకు సమప్రాధాన్యం ఉంటుంది. గోపీసుందర్ (Gopi Sundar) అద్భుతమైన సంగీతాన్నందించాడు. ఈ వేసవిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతుంది’ అన్నారు.
చిత్ర సమర్పకుడు అనిల్ సుంకర (Anil Sunkara) మాట్లాడుతూ ‘శ్రీవిష్ణు (Sree Vishnu) ఎంచుకునే కథలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో ఆయనలోని కామెడీ కోణాన్ని చూస్తారు.
చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరిని మెప్పిస్తుంది’ అన్నారు. కుటుంబమంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేసే చిత్రమిదని దర్శకుడు రామ్ అబ్బరాజు (Ram Abbaraju) తెలిపారు.
Reba Monica John At Samajavaragamana Movie Teaser Launch