తిరుమల : ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకొనె (Deepika Padukone) తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు ఆమె తన సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం తిరుపతి (Tirupati) కి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాలినడకన అలిపిరి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు. రేపు (శుక్రవారం) తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి పూజలు చేయనున్నారు. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఫైటర్ సినిమాలో హృతిక్ రోషణ్ సరసన ఆమె నటిస్తుంది.