Apps:
Follow us on:

Syed Sohel | ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు మూవీ ప్రెస్ మీట్‌లో బిగ్ బాస్ సోహెల్..

1/9సొహైల్‌ (Bigboss Sohel), మృణాళిని హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు.
2/9ఈ చిత్రాన్ని కె అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, కల్పన చిత్ర పతాకాలపై కోనేరు కల్పన నిర్మించారు. ఈ నెల 3న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.
3/9తాజాగా జరిగిన కార్యక్రమంలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ...‘నా చిత్రాల్లో పాటలు బాగుంటాయి. ఇందులోనూ బాగా కుదిరాయి.
4/9హీరో క్యారెక్టర్‌ దగ్గర నుంచి ప్రతి పాత్ర మిమ్మల్ని నవ్విస్తుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందించాను. ఈ సినిమా థియేటర్‌లో మీ నవ్వులు చూడాలని వేచి చూస్తున్నాను అన్నారు.
5/9నిర్మాత సి కళ్యాణ్‌ మాట్లాడుతూ...మనసున్న ప్రతి ప్రేక్షకుడిని కదిలించే చిత్రమిది. కుటుంబంలోని ప్రేమ, అనుబంధాలు, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌ సన్నివేశం కట్టిపడేస్తుంది’ అన్నారు.
6/9హీరో సోహైల్‌ మాట్లాడుతూ..‘ఇండస్ట్రీలో వారసత్వం ఎక్కువగా ఉంది అనడం సరికాదు. ఇలాంటి చిత్రాలతో ప్రతిభ గల నాలాంటి యువ నటులకూ అవకాశాలు దక్కుతున్నాయి.
7/9ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన సినిమాలో హీరోగా నటించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు.
8/9ఈ కార్యక్రమంలో నిర్మాత అచ్చి రెడ్డి, కోనేరు కల్పన తదితరులు పాల్గొన్నారు.
9/9Bigboss Sohel at Organic Mama Hybrid Alludu Movie Press Meet