పిల్లలకు బొమ్మలంటే ఇష్టం. అందమైన బొమ్మలుంటే అన్నం కూడా అవసరం లేదు. అనావిలా మిశ్రాకు పిల్లలన్నా, బొమ్మలన్నా ప్రాణం. అందుకే, నిరుపయోగమైన ఆర్గానిక్ ఫ్యాబ్రిక్‌తో చిట్టిచిట్టి డ్రస్‌లు తయారుచేసి బొమ్మలకు అలంకరిస్తుంది. అనావిల ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్. కోతి, కుందేలు, కుక్క, జిరాఫీ తదితర పాత్రలతో కొత్తరకం పంచతంత్ర కథల్ని పరిచయం చేస్తూ ఉంటుంది. బొమ్మలకు వస్ర్తాలను సమకూర్చుతున్న మొదటి ఇండియన్ డిజైనర్‌గా ఆమె గుర్తింపు పొందింది. మొదట్లో తన ప్రయత్నాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదొక ట్రెండ్‌గా మారుతున్నది. బొమ్మల ద్వారా పిల్లలకు మన సంస్కృతిని, జానపదాలను పరిచయం చేయాలన్నది అనావిల లక్ష్యం.