బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో ముందుండే జీ తెలుగు.. సరిగమప సమరానికి సిద్ధమవుతున్నది. పదిహేను సీజన్లుగా ఎంతోమంది ప్రతిభావంతులైన గాయనీ గాయకులను వెలికితీసిన ఈ కార్యక్రమం ‘ది నెక్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ శీర్షికతో పదహారో సీజన్‌కు నాంది ప్రస్తావన చేస్తున్నది.
ఇందులో భాగంగా తెలుగు రాష్ర్టాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నది. ఈ నెల 25 ఆదివారం హైదరాబాద్‌లో ఆడిషన్స్ చేపట్టనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సనత్‌నగర్‌లోని హిందూ మహిళా కళాశాల, హిందూ పబ్లిక్ స్కూల్ దగ్గర ఈ కార్యక్రమం జరగనుంది. 15 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్యనున్న గాయనీ గాయకులు ఇందులో పాల్గొనవచ్చు.
ఇతర వివరాల కోసం 9154670067 నెంబర్‌ను సంప్రదించవచ్చు. అంతేకాదు ఔత్సాహికులు ఈ నెల 30 వరకు డిజిటల్ ఆడిషన్స్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. పాల్గొనదలచిన వారు తాము పాడిన పాటకు సంబంధించిన వీడియోను 9154670067 నెంబర్‌కు వాట్సాప్ గానీ, ztsaregamapa@zee.com ఐడీకి ఈ-మెయిల్ చేయొచ్చు.