జహీరాబాద్ రైతు నేస్తం
పొలం గట్టే తన ఆఫీస్. రైతు క్షేమమే తన బాధ్యత. కొత్త వంగడాల పరిచయం, అధిక దిగుబడి కోసం వ్యవసాయ క్షేత్రాల్లో ప్రయోగాలు, నూతన వ్యవసాయ పద్ధతుల్లో రైతులకు శిక్షణ, రైతు సందేహాలకు సలహాలిస్తూ రైతు కుటుంబాల్లో వెలుగులు నింపింది నీరడి లావణ్య.
పొలం గట్టే తన ఆఫీస్. రైతు క్షేమమే తన బాధ్యత. కొత్త వంగడాల పరిచయం, అధిక దిగుబడి కోసం వ్యవసాయ క్షేత్రాల్లో ప్రయోగాలు, నూతన వ్యవసాయ పద్ధతుల్లో రైతులకు శిక్షణ, రైతు సందేహాలకు సలహాలిస్తూ రైతు కుటుంబాల్లో వెలుగులు నింపింది నీరడి లావణ్య. న్యాల్కల్, జహీరాబాద్ మండలాల్లో సిరుల సాగు ప్రయత్నంలో ‘జాతీయ ఉత్తమ మహిళా వ్యవసాయ విస్తరణ అధికారి’ అవార్డు పండించింది. మన ఆడబిడ్డ అరుదైన గౌరవం దక్కించుకున్న సందర్భంగా సాగులో ఆమె చేసిన అద్భుతాలేమిటో తెలుసుకుందాం.
నీరడి లావణ్య శంషాబాద్ గ్రామంలో పుట్టి పెరిగింది. అంజయ్య, పద్మ అమ్మానాన్నలు. హైదరాబాద్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ బీయస్సీ చదివింది. చదువు పూర్తి కాగానే వ్యవసాయ శాఖలో ఉద్యోగంలో చేరింది. మొదట న్యాల్కల్ మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టింది. అక్కడ కొన్నేండ్లు పనిచేసిన తర్వాత జహీరాబాద్ మండల వ్యవసాయ అధికారిగా బదిలీ అయింది. ఈ పద్నాలుగేండ్ల ప్రయాణంలో ఎక్కడ పనిచేస్తే అక్కడ నేల స్వభావం, స్థానిక మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త పంటల సాగు, అధిక దిగుబడి కోసం కృషి చేస్తూ ఉండేది.
రాతి నేలలో..
జహీరాబాద్ ప్రాంతమంతా రాతి నేల. ‘ఈ రాతి నేలలో ఏం పండుతుంది?’ అని అందరూ నవ్వుతున్నా… పట్టుదలతో నువ్వుల సాగును పరిచయం చేసి అద్భుతాన్ని ఆవిష్కరించింది లావణ్య. అలాగే జహీరాబాద్ మెట్ట పంటలకు ప్రసిద్ధి. కంది పంట అనగానే ఎవరైనా జహీరాబాద్ ప్రాంతాన్నే గుర్తు చేసుకుంటారు. ఈ ప్రాంత రైతులకు బీఎస్ఎంఆర్ కంది వంగడాన్ని పరిచయం చేసింది. కర్ణాటకలోని కృషి విజ్ఞాన కేంద్రం నుంచి బీఎస్ఎంఆర్ కంది సాగుని ఆత్మ పథకం ద్వారా జహీరాబాద్ రైతులు సాగులోకి తీసుకువచ్చేలా ప్రోత్సహించింది. ప్రత్యామ్నాయ వంగడం దొరకడంతో రైతులకు లాభాల పంట పండింది.
పిలిస్తే పలుకుతూ..
చెరకు సాగులో మల్చింగ్ విధానాన్ని ఈ ప్రాంత రైతులకు పరిచయం చేసింది లావణ్యే. ఈ విధానంలో కలుపు సమస్య, నీటి ఎద్దడికి పరిష్కారం చూపింది. చెరకులో అంతర పంటలుగా సోయా, కూరగాయల సాగును ప్రవేశపెట్టింది. రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది. తన కృషి ఫలించి.. రైతులు రెండు రకాలుగా ఆదాయం వచ్చేలా చేసిందామె! పత్తి రైతులు డీఏపీకి ప్రత్యామ్నాయంగా ఫాస్పేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా (పీఎస్బీ ) వాడేలా ప్రయోగాలు సాగించింది.
పీఎస్బీ ఎరువు వాడితే డీఏపీ వాడకం వల్ల మొక్క ఎత్తు తగ్గినా కాయల సంఖ్య పెరుగుతుందని వ్యవసాయ క్షేత్రంలో నిరూపించింది. తర్వాతి కాలంలో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఆయిల్ పామ్ సాగువైపు రైతుల్ని ప్రోత్సహించింది. ఆమె చొవరతో మూడు వందల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టారు. రైతుల కోసం లావణ్య నిబద్ధతను గుర్తించి ఉత్తమ ఎంఈఓగా జిల్లా కలెక్టర్ అవార్డు ప్రదానం చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ లావణ్య కృషిని గుర్తిస్తూ, ‘జాతీయ ఉత్తమ మహిళా వ్యవసాయ విస్తరణ అధికారి అవార్డుని ప్రదానం చేసింది.
రైతుల అండతోనే నాకీ గౌరవం!
ఈ అవార్డు నా ఒక్కదానిదే కాదు. నన్ను నమ్మిన జహీరాబాద్ రైతులందరిదీ. పద్నాలుగేండ్ల ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, రైతులకు, ఉన్నతాధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గౌరవం నా బాధ్యతను మరింత పెంచింది.’
-గున్నాల విఠల్, జహీరాబాద్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

