నా కూతురికి..క్రమశిక్షణ తెలియదు!

మా పెద్దమ్మాయికి పదహారేండ్లు. ఎత్తు, వయసుకు ఉండాల్సిన దానికంటే లావుగా ఉంటుంది. చదువులో చురుకే అయినా, చిన్నచిన్న పనులకు కూడా బద్ధకిస్తుంది. పిల్లలతో కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటాన్నేను. నా ఇద్దరు కూతుళ్లూ మంచి ఆహారం తింటూ రోజూ వ్యాయామం చేయాలని కోరుకుంటాను. అలాగే వేళకు నిద్రపోవాలని, ఉదయాన్నే లేవాలని అనుకుంటాను. ఇంటి పనులు నేర్చుకుంటే బాగుంటుందని నా ఆలోచన. కానీ చిన్నచిన్న పనులకు కూడా నా పెద్ద కూతురు నాపైనే ఆధారపడుతుంది. బయటి ఫుడ్ ఆర్డర్ చేయడం అలవాటైంది. వ్యాయామం పేరెత్తితేనే చికాకు పడుతుంది. ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఏ అర్ధరాత్రికో నిద్ర పోతుంది. ఉదయం ఆలస్యంగా లేస్తుంది. వీటన్నిటికీ వాళ్ల నాన్న మద్దతు ఇస్తారు. ఈ విషయంలో నాకు, నా భర్తకు తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు.
–ఓ తల్లి
జ: టీనేజ్ పిల్లల పెంపకం విషయంలో ఒక కచ్చితమైన పద్ధతి అంటూ ఉండదు. పిల్లల స్వభావాన్నిబట్టి తల్లిదండ్రులు ఏదో ఓ మార్గాన్ని ఎంచుకుంటారు. అన్నిటికంటే ముందుగా మీరు, మీ భర్తతో మాట్లాడి చర్చించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. పిల్లల విషయంలో ఇద్దరూ ఒకేమాటపై ఉండండి. క్రమశిక్షణ ఎంత అవసరమన్నది మీ ఆయనకు వివరించండి. ఈ విషయంలో మీవారి అభిప్రాయాలను కూడా గౌరవించాల్సి ఉంటుంది. మీరిద్దరూ ఒకమాట మీదికి వచ్చాక, అమ్మాయితో మాట్లాడటం మంచిది. అధిక బరువు వల్ల కలిగే నష్టాలను నెమ్మదిగా, అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే సమస్య తీవ్రత తెలుస్తుంది. పోషకారం, వ్యాయామం మెల్లిగా అలవాటు చేసుకుంటారు. ఆహారం, నిద్ర విషయంలో కచ్చితంగా ఉండాల్సిందే. ఒకేసారి అనేక షరతులు పెట్టడం మాత్రం సరైన నిర్ణయం కాదు. ఏదైనా సరే ప్రేమగా, నెమ్మదిగా చెప్పాలి.
సహానా రబీంద్రనాథ్
లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWITCH NOV
హైదరాబాద్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

