యోగ క్షేమాలు
ఆధునిక జీవనశైలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. తీవ్ర ఒత్తిడి, చర్మం పొడిబారిపోవడం, ముడతలు, జుట్టు రాలడం తదితర సమస్యలు యువతరాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. యోగాతో వీటన్నిటినీ నియంత్రించవచ్చు
ఆధునిక జీవనశైలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. తీవ్ర ఒత్తిడి, చర్మం పొడిబారిపోవడం, ముడతలు, జుట్టు రాలడం తదితర సమస్యలు యువతరాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. యోగాతో వీటన్నిటినీ నియంత్రించవచ్చు.
హార్మోన్ల ప్రభావం: యోగా ఎండోక్రైన్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యవస్థ సమర్థంగా ఉంటే హార్మోన్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది. చర్మ సౌందర్యం, కేశ సంరక్షణ విషయంలో ఇబ్బందులు ఉండవు.
ఫేస్ యోగా: ఎవరికివారు తమ దినచర్యలో ఫేస్ యోగాను భాగం చేసుకోవాలి. ఉదాహరణకు కళ్ల కింద సున్నితంగా మసాజ్ చేయడం వల్ల కంటి ఉబ్బరం, నల్లటి వలయాలు తొలగిపోతాయి.
కపాల ధౌతి: యోగా వల్ల అలసట తగ్గిపోతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కపాల రంధ్ర ధౌతి పద్ధతిలో నుదుటిపై మర్దన చేస్తూ ప్రశాంతత పొందవచ్చు. బెలూన్ టెక్నిక్ కూడా మంచిదే. ఇందులో బుగ్గలలో గాలి నింపుకొని కొన్ని క్షణాలు అలాగే ఉంచాలి. తర్వాత క్రమంగా వదలాలి. దీనివల్ల రక్త
ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
ఆసనాలు: జుట్టు, చర్మ సంరక్షణకు సర్వాంగాసనం, మత్స్యాసనం, హలాసనం బాగా ఉపయోగపడతాయి. ప్రారంభంలో కష్టంగా అనిపించినా.. సాధన చేసినకొద్దీ శరీరం రబ్బరు బంతిలా సులువుగా వంగుతుంది.
ప్రకృతితో స్నేహం: క్రమం తప్పకుండా వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తే మంచిది. వారంలో ఒకరోజు పచ్చదనం మధ్య గడిపితే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ఇక చెట్టుకింద సేద
తీరితే ఆక్సిజన్ థెరపీ తీసుకున్నట్టే. నిత్యం ఓ నలభై నిమిషాలు మనకోసం మనం కేటాయించుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

