Uable | టీనేజర్లను కరెక్ట్ రూట్లో నడిపించేందుకే ఈ యాప్..
యుక్త వయసు ఓ చౌరస్తా లాంటిది. మార్గదర్శనం ఉంటేనే జీవితం సరైన మలుపు తీసుకుంటుంది. లేదంటే పక్కదారి పడుతుంది. యు-ఏబుల్ ఆ కీలకమైన మజిలీలో తోడుగా
నిలుస్తుంది. ఆ స్టార్టప్ సహ-వ్యవస్థాపకురాలి హోదాలో కౌమారానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది వాసవి కందుల ( Vasavi Kandula ). ఇన్స్టాగ్రామ్, మోజ్, స్నాప్‌చాట్‌లతో పోటీపడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది యు-ఏబుల్ ( Uable ).
టీనేజ్ అంటేనే శారీరక, మానసిక మార్పులు. వీటికితోడు హార్మోన్ల హార్మోనియం ఒకటి. ఈ దశలో యువతను సురక్షితంగా తదుపరి దశకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏర్పడిందే యు ఏబుల్. ఇదో వర్చువల్ కమ్యూనిటీ. 13-19 ఏండ్ల బాల బాలికలే యు-ఏబుల్ లక్ష్యం. వారికి మాత్రమే ప్రవేశం. ఈ వేదిక ఆలోచన, ఆవిష్కరణ, ఆర్థిక స్వావలంబన దిశగా నడిపిస్తుంది. స్నేహితులను ఎంచుకోవడానికి, అభిరుచులను అన్వేషించుకోవడానికి, మొత్తంగా ఓ కొత్త బంగారులోకాన్ని ఆవిష్కరించుకోవడానికి సహకరిస్తుంది.

కో-ఫౌండర్‌గా
People, Passion, Potential.. కాన్సెప్ట్‌తో 2019లో బెంగళూరు కేంద్రంగా యు-ఏబుల్ ప్రారంభమైంది. ఈ సంస్థ సహ-వ్యవస్థాపకురాలు వాసవి కందుల ఐఐటీ మద్రాస్‌లో చదువుకుంది. ఫైనాన్షియల్ కన్సల్టింగ్‌లో అనుభవం సంపాదించింది. తను సర్టిఫైడ్ మాంటిస్సోరి ట్రైనర్ కూడా. యు-ఏబుల్ స్థాపనకు ముందు డాయిష్ బ్యాంక్, సిటీ బ్యాంక్, జేపీ మోర్గాన్లతో కలిసి పనిచేసింది. ఐఐటీ రూర్కీ గ్రాడ్యుయేట్ సౌరభ్ సక్సేనాతో కలిసి యు-ఏబుల్ను స్థాపించింది. ఆన్లైన్ లైంగిక వేధింపులు, ట్రాఫికింగ్, బెదిరింపులు, అభద్రత వంటి కౌమార సమస్యలను కూడా ఈ వేదిక చర్చిస్తుంది. ఇప్పటికే ఈ యాప్‌ను ఐదు లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం యు-ఏబుల్లో 2.5 లక్షల మంది శాశ్వత సభ్యులు ఉన్నారు.
‘ఆంత్రప్రెన్యూర్‌షిప్, ఆర్ట్ అండ్ డిజైన్, గేమింగ్, యానిమేషన్, ఫొటోగ్రఫీ వంటి రంగాల పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం ఇక్కడ హాబీ క్లబ్స్ కూడా ఉంటాయి’ అని వివరిస్తారు వాసవి కందుల.
Read More :
హైదరాబాదీ రుచులను ఆన్లైన్లో పరిచయం చేస్తున్న ఇందిర”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- inspiration
- Teenage
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

