చలిని వణికిద్దాం!
చలికాలం చాలా ప్రమాదకరమైంది. వస్తూ వస్తూ దగ్గు, జలుబు తదితర శ్వాస సంబంధ సమస్యలను వెంటబెట్టుకుని వస్తుంది. ఆ రుగ్మతలకు అడ్డుకట్ట వేయడానికి అనేక మార్గాలున్నాయి
చలికాలం చాలా ప్రమాదకరమైంది. వస్తూ వస్తూ దగ్గు, జలుబు తదితర శ్వాస సంబంధ సమస్యలను వెంటబెట్టుకుని వస్తుంది. ఆ రుగ్మతలకు అడ్డుకట్ట వేయడానికి అనేక మార్గాలున్నాయి.
చలికాలంలో పగటివేళలు తక్కువగా, రాత్రులు సుదీర్ఘంగా ఉంటాయి. శరీరానికి సూర్యరశ్మి తక్కువగా సోకుతుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్-డి తగినంత లభించదు. దాంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పొంచి ఉంటుంది. చలి వాతావరణంలో వైరస్ త్వరగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా జలుబును తప్పించుకోవాలంటే తగిన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి తప్పనిసరి. ఫ్లూ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ఫ్లూయెంజా వైరస్ కారణంగా ఫ్లూ వస్తుంది. ఇది శ్వాస సంబంధమైన అంటువ్యాధి. ఒళ్లునొప్పులు, జ్వరం, తలనొప్పి ప్రధాన లక్షణాలు.
గొంతునొప్పి కూడా చలికాలపు సమస్యే. అందులోనూ గొంతులో వాపు, గొంతులో పుండ్లు చాలా ఇబ్బంది పెడతాయి. స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ రుగ్మత సోకుతుంది. ఇది చిన్న పిల్లలకు మరింత ఇబ్బంది కలిగిస్తుంది. వైద్యులను సంప్రదిస్తే యాంటీబయాటిక్స్, జ్వరం మందులు సూచిస్తారు. దాంతోపాటే, తగిన విశ్రాంతి తీసుకోవాలి. ఈ సీజన్లో బ్రాంకైటిస్, న్యుమోనియా విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, ఆస్తమా, గుండెజబ్బులు, క్యాన్సర్ బాధితులకు న్యుమోనియా ముప్పు ఎక్కువ.
ఇవీ జాగ్రత్తలు
- బయటికి వెళ్తున్నప్పుడు స్వెటర్, టోపీ, మాస్క్ తప్పనిసరి.
- ఆహారంలో విటమిన్-సిని భాగం చేసుకోవాలి. దీంతో జలుబు, ఫ్లూ తదితర సమస్యల ముప్పు తగ్గుతుంది.
- ధ్యానం, వ్యాయామం ఉత్తమం. ఆందోళన, ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడే మన శరీరం ఇన్ఫెక్షన్లతో
సమర్థంగా పోరాడగలదు. - వృద్ధులు, తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడేవారు డాక్టర్ల సలహాతో ఇన్ఫ్లుయెంజా టీకాలు తీసుకోవాలి.
- నగర ప్రాంతాల ప్రజలు బయటి పొగ ఇండ్లలోకి చేరకుండా కిటికీలు మూసి ఉంచాలి.
- గాలి బాగా ప్రసరించేలా ఫ్యాన్లు ఆన్ చేసి ఉంచాలి. కాలుష్యం ఇంట్లోకి ప్రవేశించకుండా ఫిల్టర్లను బిగించాలి.
- బయట పొగ ఉన్నప్పుడు అటువైపు వెళ్లకపోవడమే మంచిది.
- కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ఎన్ 95 మాస్కులు ధరించడం ఉత్తమం.
జీవనశైలి మార్పులు
- వేడిగా ఉన్న పోషకాహారం తీసుకోవాలి. తగినంత నిద్ర అవసరం. చురుగ్గా ఉండాలి.
- పొట్టుతీయని ధాన్యం, మాంసం, చేపలు, చిక్కుడు జాతి గింజలు, మసాలాలు, తాజాపండ్లు, కూరగాయలు రోగ నిరోధక శక్తిని ఇస్తాయి.
- మాయిశ్చరైజర్లు, సూర్యకాంతి నుంచి సంరక్షించే క్రీములు వాడాలి. ఎక్కువగా నీళ్లు తాగాలి.
- విటమిన్-బి12, విటమిన్-డి3 తగిన మోతాదులో అందకపోతే అలసట అధికం అవుతుంది.
- తగినంత సహజ కాంతి శరీరం మీద పడేలా చూసుకోవాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- diet
- Health
- precautions
- season
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

