అరుదైన పక్షులకు అండగా మారింది.. అంతరించిపోకుండా కాపాడింది
Wildlife Biologist Purnima Devi Barman | పూర్ణిమా బర్మన్ ఒకప్పుడు జంతుశాస్త్ర విద్యార్థి. పాఠాల్లో చదువుకున్నవి, తరగతి గదుల్లో విన్నవి మార్కులకే పరిమితం చేయలేదామె. ఉద్యమ స్ఫూర్తితో.. అసోంలో ఓ పక్షి జాతి అంతరించిపోకుండా కాపాడింది.

పదిహేనేండ్ల నాటి మాట. ‘హర్గిలా పక్షులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. కొద్ది కాలంలోనే పూర్తిగా కనుమరుగైపోవడం ఖాయం’ అంటూ గౌహతి యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్ చెప్పిన పాఠం పూర్ణిమా బర్మన్ను ఆలోచింపజేసింది. చాలామంది పులులు, మొసళ్ల సంరక్షణకు పాటుపడుతున్నారు. ఇలాంటి బలహీనమైన పక్షుల కోసం కూడా ఏదైనా చేయవచ్చు కదా అనిపించింది. హర్గిలా పక్షుల సంరక్షణను తన బాధ్యతగా భావించింది. వాటి మనుగడకు తీసుకోవాల్సిన చర్యలపై పీహెచ్డీ చేయాలని తీర్మానించుకుంది పూర్ణిమ.

‘స్కావెంజర్’ పక్షులు
‘గ్రేట్ అడ్జుటాంట్’ జాతికి చెందిన హర్గులా చాలా అరుదైనది. ఈ పక్షుల్ని ‘ప్రకృతి పారిశుద్ధ్య సమూహం’ అనీ పిలుస్తారు. ఇవి జంతు కళేబరాలు, చేపలు, పాములు, తొండలను తిని బతుకుతాయి. చనిపోయిన జలచరాలను ఒడ్డుకు తెచ్చి.. నీటి కాలుష్యాన్ని నివారిస్తాయి. వీటి ముక్కు కత్తిలా పొడవుగా ఉంటుంది. నలుపు, తెలుపు రెక్కలు ఆకర్షణగా అనిపిస్తాయి. తీక్షణమైన చూపులతో ఎంతచిన్న జీవినైనా గుర్తించ గలవు. క్షణాల్లో వేటాడగలవు. అడ్జుటాంట్ జాతిని సంరక్షించడం ద్వారా ప్రకృతిని శుభ్రంగా ఉంచుకోవచ్చని ప్రజల్లో ప్రచారంచేస్తూ.. ఈ పక్షిజాతి మనుగడకు కృషి చేస్తున్నది పూర్ణిమ.

ఓ సంఘటనతో
హర్గిలా పక్షులు అయిదడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పుతో సువిశాలమైన రెక్కలను కలిగి ఉంటాయి. ఇవి ఇండియా, కాంబోడియాలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. అసోం, బీహార్లలో వీటి సంచారం ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి చెట్లపై గూళ్లు కట్టుకుని ఆవాసం చేస్తాయి. పూర్ణిమ వీటి గురించి పరిశోధన చేసేందుకు వెళ్లినప్పుడు.. ఆ పక్షిగూళ్లు ఉన్న చెట్టును ఎవరో నరికేస్తున్నారు. ఆ వృక్షం కుప్పకూలి పోయింది. ఆ సంఘటనలో పద్నాలుగు హర్గిలా పిల్లలు చనిపోయాయి. అది చూసి ఆమె చలించిపోయింది. ఆ ఘోరాన్ని ఆపేందుకు గౌహతి కేంద్రంగా హర్గిలా ఫౌండేషన్ను స్థాపించింది. అసోంలోని దాదరా గ్రామాన్ని ఉద్యమ కేంద్రంగా ఎంచుకున్నది. హర్గిలా పక్షుల గూళ్లు ఉండే చెట్లను నరకడం అపశకునమని స్థానికులకు నచ్చజెప్పింది. ఆ చైతన్యం చుట్టుపక్కల గ్రామాలకూ విస్తరించింది. ఇప్పుడు ఈ సంస్థలో పదివేల మంది సభ్యులు ఉన్నారు. పదేండ్లలో పక్షుల సంఖ్య పదిరెట్లు పెరిగింది. పూర్ణిమ కృషిని గుర్తించిన రాయల్ జియోగ్రఫికల్ సొసైటీ ‘వైట్లీ అవార్డ్’తో గౌరవించింది.
Read More :
“మార్కెట్లో దూసుకెళ్తున్న ఈ కొత్తరకం ఇన్నర్వేర్ బ్రాండ్ వెనుకున్న కథ తెలుసా !!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- inspiration
- Wildlife
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

