HomeZindagiWashing Hair At Night Might Be Unhealthy
రాత్రిళ్లు తలస్నానం చేస్తే..
కొంతమంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుందనే నమ్మకంతో రాత్రిళ్లు తలస్నానం చేస్తుంటారు. మరికొందరు తలమొత్తం తడిసి పోకుండా జుట్టు మాత్రమే శుభ్రం చేసుకొని, తుడుచుకోకుండానే పడుకుంటారు. దీనివల్ల ఎంత నష్టమంటే..
కొంతమంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుందనే నమ్మకంతో రాత్రిళ్లు తలస్నానం చేస్తుంటారు. మరికొందరు తలమొత్తం తడిసి పోకుండా జుట్టు మాత్రమే శుభ్రం చేసుకొని, తుడుచుకోకుండానే పడుకుంటారు. దీనివల్ల ఎంత నష్టమంటే..
రాత్రిపూట తలస్నానం చెయ్యడం వల్ల ఉదయం లేవగానే జుట్టు బాగా చిక్కులు పడిపోతుంది. మృదువుగా కూడా ఉండదు.
రాత్రిపూట జుట్టును శుభ్రం చేసుకొని, అలాగే పడుకోవడం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. నిద్రపట్టదు.
నిద్రలో అటూ ఇటూ మెసలడం వల్ల జుట్టు బాగా చిక్కులు పడిపోతుంది, రాలిపోతుంది.
తడి జుట్టుతోనే పడుకుంటే దిండు కారణంగా జుట్టు ఆకృతి మారిపోతుంది. పైగా రాత్రంతా తడిగా ఉండటం వల్ల జుట్టుకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావొచ్చు. జలుబు చేసే అవకాశం ఎక్కువ.
మాడు కూడా తడిగా ఉంటే.. శిలీంధ్రాలు, పేలు, చుండ్రు పెరిగిపోవచ్చు. వీటివల్ల విపరీతమైన దురద.
రాత్రిపూట జుట్టును కడిగినా, తలస్నానం చేసినా.. శుభ్రంగా తల మొత్తం ఆరబెట్టుకోవాలి. ఇందుకు బ్లో డ్రైయర్‌ను ఉపయోగించవచ్చు. తర్వాత వదులుగా జడవేసుకోవడం మర్చిపోవద్దు.