విజయం మీ చేతుల్లో..

దసరాతో ముగిసే నవరాత్రులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అమ్మవారికి సంబంధించిన సంప్రదాయ పండుగ ఇది. నవరాత్రులు లోకంలోని చెడును, విశృంఖలత్వాన్ని నిర్మూలిస్తాయి. అలాగే, జీవితంలో మన శ్రేయస్సుకి దోహదపడే వస్తువులు, విషయాల పట్ల కృతజ్ఞత తెలియజేసేందుకు దోహదం చేస్తాయి. నవరాత్రులను.. మూడు ప్రాథమిక లక్షణాలైన తామస, రజస, సత్వ గుణాలకు అనుగుణంగా వర్గీకరించారు. మొదటి మూడు రోజులు తామసికమైనవి, వాటికి ప్రతీకలు తీవ్రమైన దుర్గ, కాళి దేవతలు. తరువాతి మూడు రోజులు లక్ష్మికి సంబంధించినవి. కోమలమైనదే కానీ, ధన, వస్తు, కనక, వాహనాలకు ఆధారమైన దేవి. ఆఖరి మూడు రోజులు సరస్వతికి సంబంధించినవి. సత్వగుణ తేజస్సుతో అలరారే వాగ్దేవి మనలో జ్ఞానాన్ని వికసింపజేస్తుంది. నవరాత్రుల దివ్యత్వాన్ని పుణికి పుచ్చుకున్న పదో రోజు విజయ దశమి. అంటే నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పై మూడు గుణాలను జయించారని అర్థం.
ఈ తామస, రాజస, సత్వ గుణాలలో వేటిని ఎంత వృద్ధి చేసుకుంటున్నారనే దానిపైనే జీవితం ఆధారపడి ఉంటుంది. తామసంగా వ్యవహరిస్తే.. శక్తిమంతంగా తయారవ్వొచ్చు. రాజసంగా వ్యవహరిస్తే జీవితం మరోలా ఉంటుంది. సత్వ గుణాన్ని పెంపొందించుకుంటే సాత్వికశక్తిని పొందుతారు. కానీ, వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తే.. అప్పుడది శక్తికి చెందింది కాదు, ముక్తికి సంబంధించింది అవుతుంది. నవ రాత్రుల తరువాత పదవది, అంటే ఆఖరుది విజయదశమి- అంటే మీరు వాటిలో దేనికీ లొంగి పోకుండా, వాటిని దాటి వెళ్ళారు. మీరు వాటి అన్నిటిలోనూ పాల్గొన్నారు కానీ మీరు ఆ గుణాలను మీవిగా చేసుకోలేదు. మీరు వాటిని జయించారు. అదే విజయదశమి, జయం పొందిన రోజు.
ప్రేమాశీస్సులతో..
సద్గురు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

