ఈ గులాబీలు నెలలు గడిచినా వాడిపోవు.. హైదరాబాదీ యువతి వినూత్న ఆలోచన
Chitra Das | పుట్టినరోజులు, వివాహాలు, మర్యాద పూర్వక భేటీల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో చాలా మంది అవతలి వారికి శుభాకాంక్షలు చెప్పేందుకు పుష్పగుచ్ఛాలను ఎంచుకుంటారు. ఆ బొకేలను ఎంత ప్రేమగా దాచుకున్నా ఒకట్రెండు రోజుల్లోనే వాడిపోతాయి. అలా కాకుండా, అందులోని పూలు నెలల తరబడి వసివాడకుండా ఉంటే కనుక, బొకే అనేది తిరుగులేని బహుమతి అవుతుందని ఆలోచించారు హైదరాబాదీ చిత్రాదాస్.

దాన్నో వ్యాపార ఆలోచనగా మార్చి ‘చాంప్స్ ఫ్లవర్ ( Champs fleur )’ పేరిట పూల కానుకలు అందించే సంస్థను స్థాపించారు. అందులో ‘ఫరెవర్ రోజెస్’గా పిలిచే గులాబీ ఏడాదికిపైగా వాడిపోకుండా ఉంటుంది. జపాన్ టెక్నాలజీతో నాలుగు అంచెల్లో పూల నిల్వ ప్రక్రియ జరుగుతుంది. ఒక్క గులాబీలే కాదు హైడ్రాంజియాలు, బేబీస్ బ్రెత్, రైస్ ఫ్లవర్స్లాంటి పుష్పాల జీవితకాలాన్నీ పెంచుతున్నారు. వాటిని గాజు పెట్టెల్లో అందంగా అమర్చి విక్రయిస్తున్నారు. అంతేకాదు, ఈ తరహా పూలతో హెయిర్ క్లిప్లు, వేణీలు, బ్రూచ్ల లాంటి యాక్సెసరీలనూ తయారు చేస్తున్నారు. సంస్థ వెబ్సైట్లో అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చేస్తే చాలు, దేశవ్యాప్తంగా ఎక్కడికైనా పంపుతారు.

Read More :
“మాకు మేమే సెక్యూరిటీ.. తమను తాము కాపాడుకునేందుకు సైన్యంగా మారిన బాలికలు”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

