పేపర్ బ్యాగే ఎందుకు?
మన ఇంట్లో మామిడి, అరటిపండు వంటివి సరిగా పండకపోతే పేపర్ బ్యాగ్‌లో పెట్టడం చూస్తున్నాం. కానీ, ఎప్పుడైనా అది ఎలా సాధ్యమవుతుందో గమనించారా? మనలో చాలామంది గొప్ప చెఫ్స్, సెలెబ్రిటీలు చెప్పిన చిట్కాలు చదవడానికి ఆసక్తి చూపిస్తున్నాం. కానీ, ఒక్కసారి మన ఇంట్లో మన నానమ్మ, అమ్మ చేసే ఈ చిన్ని మ్యాజిక్‌ను గమనించారా?
మన ఇంట్లో మామిడి, అరటిపండు వంటివి సరిగా పండకపోతే పేపర్ బ్యాగ్‌లో పెట్టడం చూస్తున్నాం. కానీ, ఎప్పుడైనా అది ఎలా సాధ్యమవుతుందో గమనించారా? మనలో చాలామంది గొప్ప చెఫ్స్, సెలెబ్రిటీలు చెప్పిన చిట్కాలు చదవడానికి ఆసక్తి చూపిస్తున్నాం. కానీ, ఒక్కసారి మన ఇంట్లో మన నానమ్మ, అమ్మ చేసే ఈ చిన్ని మ్యాజిక్‌ను గమనించారా? కొన్ని దశాబ్దల నుంచి ఇలా చేస్తూ వస్తున్నారు. కాలక్రమేణ ‘ఎలా.. ఎందుకు’ అనే ప్రశ్నలు అడగకపోవడం వల్ల మర్చిపోయిన ఈ మ్యాజిక్ వెనుక రహస్యాన్ని తెలుసుకుందాం.
పండ్లలో రెండు రకాలు ైక్లెమెటిక్, నాన్ైక్లెమెటిక్ అని ఉంటాయి. ఎథిలీన్ విడుదల చేసేవి.. విడుదల చేయనివి. ఎథిలీన్ విడుదల చేసే పండ్లు ైక్లెమెటిక్ కోవకు చెందినవి. ఇవి పండటానికి చెట్టుకే ఉండనవసరం లేదు. చెట్టు నుంచి కోసిన తరువాత కూడా ఇలా పేపర్ బ్యాగ్‌లో ఉంచితే గ్యాస్ విడుదల చేసి పండుతాయి. కానీ, పుచ్చకాయ, నిమ్మ, చెర్రీ, దోసకాయ వంటి నాన్ ైక్లెమెటిక్ పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత పక్వానికి రావు. ఎథిలీన్‌ను విడుదల చేయవు కాబట్టి, వీటిపై ఈ చిట్కా పనిచేయదు. అవి పండాలంటే కచ్చితంగా చెట్టుకే ఉండాలి. లేకపోతే తగిన రుచి, పక్వం, తీపిని సమకూర్చుకోలేవు.
ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెడితే..?
పేపర్ బ్యాగ్‌లోనే ఎందుకంటే ఆపిల్, మామిడి, కివీ, పీచ్, అవకాడో వంటి పండ్లు పక్వం చెందే సమయంలో ‘ఎథిలీన్’ అనే సహజ వాయువును విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కార్బన్ డయాక్సైడ్ను బంధించకుండా దానికి తగిన తోవను చూపడంలోనూ, ఆక్సిజన్ లోపలికి వచ్చే వెసులుబాటును పేపర్ బ్యాగ్ కల్పిస్తుంది. ఈ పండ్లను ప్లాస్టిక్ కవర్లో ఉంచితే కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్లే అవకాశం లేక, ఆక్సిజన్ లోనికి వచ్చే మార్గం లేక.. పండ్లు కుళ్లిపోతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Bananas
- fruits
- Fruits Ripen
- mangoes
RELATED ARTICLES
తాజా వార్తలు
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

