KL Rahul and Athiya Shetty Marriage | ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో పెండ్లికి సిద్ధమవుతున్నది బాలీవుడ్ తార అతియా శెట్టి. సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి బాలీవుడ్లో ‘హీరో’, ‘ముబారకన్’, ‘మోతీచూర్ చక్నాచూర్’, ‘తడప్’ వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. మంచి ఫామ్‌తో రాహుల్ భారత జట్టులో స్థిరపడ్డాడు. గత మూడేండ్లుగా కేఎల్ రాహుల్, అతియా ప్రేమించుకుంటున్నారు. వీరి సాన్నిహిత్యం గురించి ఇరు కుటుంబసభ్యులకూ తెలుసు. కొద్ది నెలల్లోనే వివాహం జరిపించాలని పెద్దలు భావిస్తున్నారు.
తాజాగా అతియా తండ్రి నటుడు సునీల్ శెట్టి మాట్లాడుతూ…‘పెళ్లి జరిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు అనేది పిల్లలు (కేఎల్ రాహుల్, అతియా) నిర్ణయించుకోవాలి. రాహుల్ బిజీ షెడ్యూల్స్‌తో తీరిక లేకుండా ఉన్నాడు. ఆసియా కప్, వరల్డ్ కప్, సౌతాఫ్రికా టూర్.. ఇలా వరుస పర్యటనలు ఉన్నాయి. ఎప్పుడైనా వీలున్నా.. రెండు రోజులు మాత్రమే సెలవు ఉంటున్నది. పెళ్లంటే రెండు రోజుల్లో జరగదు కదా. అందుకే అతని వీలును బట్టి వివాహ కార్యక్రమాలు ఉంటాయి’ అని చెప్పుకొచ్చాడు.
కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్.. డబ్బుల్లేక ఆపరేషన్ కూడా పోస్ట్‌పోన్ !!