కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్.. డబ్బుల్లేక ఆపరేషన్ కూడా పోస్ట్‌పోన్ !!
KGF Actor Harish Rai | కేజీఎఫ్ సినిమాలో ఖాసిం చాచాగా నటించిన యాక్టర్ గుర్తున్నాడా? ఈ పాత్రలో మెప్పించిన ఆ నటుడి పేరు హరీశ్ రాయ్. ప్రస్తుతం ఈయన క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. గత కొద్దిరోజులుగా తాను గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీశ్ రాయ్ వెల్లడించాడు. ప్రస్తుతం క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని తెలిపాడు.
క్యాన్సర్ కారణంగా తన గొంతు వాచిపోయిందని.. అది కనబడకుండా ఉండాలనే కేజీఎఫ్ సినిమాలో గడ్డం పెంచుకుని కనిపించానని తన ఆరోగ్య పరిస్థితిని హరీశ్ రాయ్ వివరించాడు. గత మూడేండ్లుగా తాను క్యాన్సర్‌తో పోరాడుతున్నానని, కేజీఎఫ్‌లో నటించడానికి ముందే ఈ మహమ్మారి బారిన పడినట్లు బయటపెట్టాడు. అయితే ఆ సమయంలో తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఆపరేషన్‌ను కూడా పోస్ట్‌పోన్ చేసుకోవాల్సి వచ్చిందని.. తాను నటించిన సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఎదురుచూడాల్సి వచ్చిందని వాపోయాడు. ప్రస్తుతం క్యాన్సర్ నాలుగో స్టేజిలో ఉందని చెప్పుకొచ్చాడు. రోజురోజుకీ తన పరిస్థితి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇండస్ట్రీలోని సహచరులు, అభిమానులను ఆర్థికసాయం అడిగేందుకు గతంలో ఒక వీడియో కూడా రికార్డు చేశానని.. కానీ చివరి నిమిషంలో సోషల్‌మీడియాలో పోస్ట్ చేయాలన్న తన ఆలోచనను విరమించుకున్నట్లు వివరించాడు.
హరీశ్ రాయ్ ప్రస్తుతం కిద్వాయ్ ఆస్పత్రిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆయన పరిస్థితి గురించి తెలిసిన ప్రముఖ నటుడు ఆయన వైద్య ఖర్చులు భరిస్తున్నట్లు సమాచారం. ఇక హరీశ్ రాయ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసి కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, దర్శక నిర్మాతలు ఆయనకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.
Read More :
కొరటాల శివకు ఎన్ని కష్టాలు వచ్చాయో.. ఎన్టీఆర్30 కథ పూర్తిగా మారనుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Cancer
- Harish Rai
- kgf
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

