Comedian Ali Daughter Engagement | కమెడియన్ అలీ పెద్ద కూతురు ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అలీ భార్య జుబేదా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
కమెడియన్ అలీ జుబేదా దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె ఫాతిమా మెడిసిన్ పూర్తి చేసింది. దీంతో ఆమెకు పెండ్లి చేయాలని నిశ్చయించారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ వేడుకకు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, సాయికుమార్ సహా పలువురు బంధుమిత్రులు హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇక అలీకి కాబోయే అల్లుడి విషయానికొస్తే అతని పేరు షేక్ షెహయాజ్. అతనొక డాక్టర్. తనతో పాటు అతని కుటుంబసభ్యుల్లో చాలామంది డాక్టర్లే ఉన్నారట. ఈ విషయాన్ని అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ వీడియోలో వెల్లడించింది. జుబేదా అలీ యూట్యూబ్ వీడియోలతో సపరేట్ ఫ్యాన్‌బేస్‌ను క్రియేట్ చేసుకుంది. ఎప్పటికప్పుడు వీడియోలు పోస్టు చేస్తూ యూట్యూబ్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పటికే ఈమె ఛానల్‌కు 5 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.
`ఫస్ట్ డే ఫస్ట్ షో` జాతి రత్నాలు లాంటి వినోదం పంచుతుంది : అనుదీప్ కెవి ఇంటర్వ్యూ
తనను తప్పించిన సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కాజల్
టాలీవుడ్‌నే నమ్ముకుంటున్న రణ్ బీర్ కపూర్.. ‘బ్రహ్మాస్త్ర’ ఆశలన్నీ తెలుగు ఇండస్ట్రీపైనే..!