తనను తప్పించిన సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కాజల్
Kajal Aggarwal | పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాలను మాత్రమే ఇప్పుడు పూర్తి చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆమె ఓ సినిమాకు సోషల్‌మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పింది. అది చూసిన తర్వాత అభిమానులు కాజల్ మంచితనాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం తనను తప్పించిన సినిమాకు ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పడమే.
https://t.co/xqliko0Zof goodluck team #TheGhost ! @iamnagarjuna @PraveenSattaru @sonalchauhan7 @SVCLLP @nseplofficial @iamMarkKRobin #TheGhostOnOct5
— Kajal Aggarwal (@MsKajalAggarwal) August 26, 2022
గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం ది ఘోస్ట్. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. కానీ నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా కాజల్‌ను ఎంపిక చేశారు. ఆమెపై కొంతభాగం షూటింగ్ కూడా చేశారు. అయితే కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడం, ఆ తర్వాత కాజల్ పెళ్లి చేసుకోవడం.. ఆ వెంటనే ఆమె గర్భం దాల్చడంతో నాగార్జున సినిమా నుంచి తప్పుకుంది. అదే సమయంలో చిరంజీవి ఆచార్య సినిమా కూడా కాజల్ చేజారిపోయింది. అయితే అప్పుడు ఆచార్య విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఆల్ ది బెస్ట్ చెప్పింది కాజల్. తాజాగా ది ఘోస్ట్ ట్రైలర్ విడుదలైన తర్వాత నాగార్జునతో పాటు హోల్ టీంకు ఆల్ ద బెస్ట్ చెప్పింది చందమామ. తాను తప్పుకున్న సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్న కాజల్ మంచి మనసు చూసి అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.

Read More :
ది ఘోస్ట్ తో నాగార్జున ఆ బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ చెప్తాడా..?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

